Flipkart: జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ.. ఫుడ్ డెలివరీ బరిలోకి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్!
Flipkart: భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కేవలం వస్తువులనే కాదు, మీ ఇంటికి వేడివేడి భోజనాన్ని కూడా చేరవేసేందుకు సిద్ధమవుతోంది.
Flipkart: జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ.. ఫుడ్ డెలివరీ బరిలోకి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్!
Flipkart: భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కేవలం వస్తువులనే కాదు, మీ ఇంటికి వేడివేడి భోజనాన్ని కూడా చేరవేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 'మినిట్స్' ద్వారా క్విక్ కామర్స్ రంగంలో సత్తా చాటుతున్న ఈ వాల్‌మార్ట్ అనుబంధ సంస్థ, తాజాగా ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది.
ఫ్లిప్‌కార్ట్ తన ఫుడ్ డెలివరీ ప్రయాణాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నెలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనుంది. టెక్ హబ్ బెంగళూరును ఇందుకు వేదికగా ఎంచుకుంది. ఇక్కడ లభించే ఫలితాలను బట్టి 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి సేవలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది.
ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో జొమాటో, స్విగ్గీలు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజం రంగంలోకి దిగుతుందనే వార్త ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది.
జొమాటో షేర్ ధర: 1 శాతం క్షీణించి రూ.297.40కి చేరింది.
స్విగ్గీ షేర్ ధర: ఇది కూడా 1 శాతం పైగా పడిపోయి రూ.338.60 వద్ద స్థిరపడింది.
లక్షల కోట్ల వ్యాపారం
బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా ప్రకారం, భారత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ప్రస్తుతం రూ.81,500 కోట్లుగా ఉంది. 2030 నాటికి ఇది ఏకంగా రూ.2.26 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇంత భారీ మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్ పావులు కదుపుతోంది.
గతంలో ONDC ద్వారా ప్రయత్నించి వెనక్కి తగ్గిన ఫ్లిప్‌కార్ట్, ఈసారి పక్కా వ్యూహంతో వస్తోంది. అమెజాన్ వంటి సంస్థలు ఈ రంగంలో ఫెయిల్ అయిన నేపథ్యంలో, ఫ్లిప్‌కార్ట్ తన భారీ నెట్‌వర్క్‌తో జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీనిస్తుందో లేదో వేచి చూడాలి. వినియోగదారులకు మాత్రం ఈ పోటీ వల్ల భారీ ఆఫర్లు, మెరుగైన సేవలు దక్కే అవకాశం ఉంది.