SBI: దటీజ్ స్టేట్ బ్యాంక్ పవర్.. ఎస్‌బీఐ సరికొత్త చరిత్ర..!
SBI: సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే మందకొడిగా సాగుతాయని, ప్రైవేటు సంస్థల వేగాన్ని అందుకోలేవని ఒక నానుడి ఉంది. కానీ, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆ అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది.
SBI: దటీజ్ స్టేట్ బ్యాంక్ పవర్.. ఎస్‌బీఐ సరికొత్త చరిత్ర..!
SBI: సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే మందకొడిగా సాగుతాయని, ప్రైవేటు సంస్థల వేగాన్ని అందుకోలేవని ఒక నానుడి ఉంది. కానీ, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆ అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్టాక్ మార్కెట్ వేదికగా ఎస్‌బీఐ ఒక అరుదైన మైలురాయిని అధిగమించి, ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా నిలిచింది.
ఐటీ దిగ్గజానికే 'చెక్'.. నాల్గవ స్థానానికి ఎస్‌బీఐ
బుధవారం ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ షేర్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి. షేరు ధర 3.8 శాతం పుంజుకుని రూ. 1,187 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. ఈ జోరుతో బ్యాంకు మార్కెట్ విలువ ఏకంగా రూ. 10.94 లక్షల కోట్లకు చేరింది. తద్వారా అప్పటివరకు నాల్గవ స్థానంలో ఉన్న ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ఎస్‌బీఐ వెనక్కి నెట్టింది. ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ. 10.5 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం.
మార్కెట్ క్యాప్ రేసులో టాప్-5 కంపెనీలు:
రిలయన్స్ ఇండస్ట్రీస్: రూ. 19.87 లక్షల కోట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: రూ. 14.26 లక్షల కోట్లు
భారతీ ఎయిర్‌టెల్: రూ. 11.5 లక్షల కోట్లు
ఎస్‌బీఐ: రూ. 10.94 లక్షల కోట్లు
టీసీఎస్: రూ. 10.5 లక్షల కోట్లు
టీసీఎస్ ఎందుకు వెనుకబడింది?
ఒకప్పుడు మార్కెట్‌లో రారాజుగా వెలిగిన టీసీఎస్, గత ఏడాది కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2024 ఆగస్టులో రూ. 4,552 వద్ద ఉన్న టీసీఎస్ షేర్ ధర, ఇప్పుడు దాదాపు 36 శాతం పడిపోయి రూ. 2,909 వద్ద ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ ఐటీ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి టీసీఎస్‌పై ప్రభావం చూపగా, దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎస్‌బీఐ లాభాల జోరు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎస్‌బీఐ, కేవలం సేవల్లోనే కాదు.. సంపద సృష్టించడంలో కూడా తానే నంబర్ వన్ అని నిరూపించుకుంది. కేవలం ఒక్క రోజులోనే ఎస్‌బీఐ మార్కెట్ విలువ రూ. 38,000 కోట్లకు పైగా పెరగడం గమనార్హం. రాబోయే రోజుల్లో భారతీ ఎయిర్‌టెల్‌ను కూడా అధిగమించి టాప్-3 లోకి చేరుతుందేమో చూడాలి.