New Rules from April 1: సామాన్యులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచే కొత్త నిబంధనలు

New Rules from April 1: ఏప్రిల్ 1, 2026 నుండి భారతదేశంలో కొత్త ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

Update: 2026-04-01 04:23 GMT

New Rules from April 1, 2026

Financial Year 2026-27: క్యాలెండర్ లో ఏప్రిల్ 1 వచ్చిందంటే కేవలం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు.. సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే అనేక కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తాయి. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి డిజిటల్ పేమెంట్స్ మొదలుకొని గోల్డ్ లోన్స్ వరకు కేంద్ర ప్రభుత్వం , బ్యాంకింగ్ రంగం కీలక మార్పులు చేపట్టింది. అవేంటో తెలుసుకోకపోతే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ పేమెంట్స్‌లో డబుల్ సెక్యూరిటీ

ఇకపై డిజిటల్ ట్రాన్సాక్షన్లు కేవలం ఒక ఓటీపీ (OTP)తో పూర్తి కావు. పెరిగిపోతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం 'మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్'ను తప్పనిసరి చేసింది. ప్రతి లావాదేవీకి ఓటీపీతో పాటు ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ లేదా పిన్ నంబర్ వంటి కనీసం రెండు రకాల సెక్యూరిటీ ఫీచర్లు ఉండాల్సిందే. దీనివల్ల మీ ఫోన్ దొంగిలించినా లేదా ఓటీపీ వేరే వారికి తెలిసినా మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.

పెట్రోల్ బంకుల్లో E-20 విప్లవం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E-20 (20% ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇది వాహనాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, విదేశీ ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గిస్తుంది. వాహనదారులు తమ ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి ఇంధనాన్ని నింపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫాస్ట్‌ట్యాగ్ డెడ్ లైన్

మీరు ఇంకా మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌కు కేవైసీ పూర్తి చేయలేదా? అయితే ఈ రోజు నుంచే ఆ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కేవైసీ లేని పక్షంలో టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు టోల్ కట్టాల్సి రావచ్చు. వెంటనే మీ బ్యాంక్ పోర్టల్ ద్వారా కేవైసీ అప్‌డేట్ చేసుకోవడం మర్చిపోకండి.

బ్యాంక్ డెబిట్ కార్డ్ ఛార్జీల భారం

కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను అమాంతం పెంచేశాయి. మీ అకౌంట్ నుంచి కట్ అయ్యే ఛార్జీల వివరాలను ఒకసారి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో చెక్ చేసుకోండి. అవసరం లేని అదనపు కార్డులు ఉంటే వాటిని రద్దు చేసుకోవడం ఉత్తమం.

ఇన్సూరెన్స్ ఇక డిజిటల్ మయం

కొత్తగా బీమా పాలసీలు తీసుకోవాలనుకునే వారికి ఇది ముఖ్యమైన అప్డేట్. ఇకపై అన్ని కొత్త పాలసీలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాలి. దీనివల్ల బాండ్‌ పేపర్లు పోతాయనే భయం ఉండదు.. క్లెయిమ్ ప్రక్రియ కూడా సులభం అవుతుంది.

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్

బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్న వారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. గోల్డ్ లోన్ రీ-పేమెంట్ గడువును 180 రోజుల నుంచి ఏకంగా 270 రోజులకు పెంచినట్లు తెలుస్తోంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు అసలు, వడ్డీ చెల్లించడానికి అదనంగా మూడు నెలల సమయం లభిస్తుంది.

Tags:    

Similar News