New Income Tax Rules 2026: ఉద్యోగులకు పండగే.. రూ. 1.05 లక్షల వరకు టాక్స్ ఫ్రీ

New Income Tax Rules 2026: New Income Tax Rules 2026: మధ్యతరగతి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2026) నుండి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ముసాయిదా నిబంధనల్లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది.

Update: 2026-02-14 03:15 GMT

New Income Tax Rules 2026: ఉద్యోగులకు పండగే.. రూ. 1.05 లక్షల వరకు టాక్స్ ఫ్రీ

New Income Tax Rules 2026: మధ్యతరగతి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2026) నుండి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ముసాయిదా నిబంధనల్లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా ఆఫీసులో ఇచ్చే మీల్ కార్డులు లేదా భోజన వోచర్లపై పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం కళ్లు చెదిరేలా పెంచేసింది.

ఇప్పటివరకు కంపెనీలు ఇచ్చే సొడెక్సో (Sodexo), ఫ్లక్సీ వంటి మీల్ వోచర్లపై ఒక్కో భోజనానికి కేవలం రూ. 50 మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది. కానీ, కొత్త రూల్స్ ప్రకారం ఈ పరిమితిని ఏకంగా రూ. 200లకు పెంచారు. అంటే, చిన్నగా అనిపించే ఈ మార్పు మీ వార్షిక పన్ను ఆదాలో కీలక పాత్ర పోషించనుంది.

ఒక ఉద్యోగి నెలకు 22 రోజులు పని చేస్తాడనుకుంటే, రోజుకు రెండు మీల్ వోచర్ల (రూ. 200 + రూ. 200 = రూ. 400) చొప్పున నెలకు రూ. 8,800 పన్ను లేకుండా పొందవచ్చు. దీనిని ఏడాదికి లెక్కగడితే ఏకంగా రూ. 1,05,600 అవుతుంది. అంటే మీ జీతంలో ఈ లక్ష రూపాయలకు పైగా ఆదాయంపై మీరు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు.

పన్ను నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ కొత్త నిబంధన వల్ల పన్ను భారం భారీగా తగ్గుతుంది.స్టాండర్డ్ డిడక్షన్ (రూ. 75,000) మరియు ఈ మీల్ వోచర్ల మినహాయింపు కలుపుకుంటే, కొత్త పన్ను విధానంలో అసలు జీరో టాక్స్ కట్టే అవకాశం ఉంటుంది. పాత విధానంతో పోలిస్తే, కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపుల వల్ల దాదాపు రూ. 1.19 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.

కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే ఉచిత ఆహారం లేదా నాన్-ఆల్కహాలిక్ పానీయాల ఖర్చు (CTC లో భాగం) ఇప్పుడు పన్ను భారం నుండి విముక్తి పొందనుంది. చిన్న చిన్న ఖర్చులపై కూడా పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ఉద్యోగి జేబుకు పెద్ద ఊరటనిస్తుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News