Gold Price Today : పసిడి ప్రియులకు ఊరట.. నేడు దిగొచ్చిన బంగారం ధరలు.. ఎంత తగ్గందంటే?

Gold Price Today : నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ప్రియులకు ఇది చిన్న ఊరట. హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో తులం బంగారం ధర ఎంత ఉందో చూద్దాం.

Update: 2026-04-10 02:05 GMT

Gold Price Today

 Gold Price Today : బంగారం అంటే భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధర ఏ కొంచెం తగ్గినా కొనుగోలుదారులకు అది పెద్ద ఊరట. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు, నేడు (ఏప్రిల్ 10, శుక్రవారం) స్వల్పంగా నెమ్మదించాయి. అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నప్పటికీ, నేడు ధర తగ్గడం సామాన్యులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

హైదరాబాద్‌లో పసిడి ధరలు

భాగ్యనగరంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం (ఏప్రిల్ 10) నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 1,51,470 వద్ద కొనసాగుతోంది. నిన్న అంటే గురువారం ఇదే ధర రూ. 1,51,480 గా ఉండేది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 10 తగ్గి ప్రస్తుతం రూ. 1,38,840 వద్ద ఉంది. నిన్నటి రేటుతో పోలిస్తే ఇది స్వల్ప ఊరట అని చెప్పాలి.

విజయవాడలో కూడా అదే బాట

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు హైదరాబాద్ బాటలోనే నడిచాయి. ఇక్కడ కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,470 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,840 గా నమోదైంది. ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, తిరుపతిలో కూడా దాదాపుగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

చెన్నై మార్కెట్ అప్‌డేట్

తమిళనాడు రాజధాని చెన్నైలో బంగారం ధరలు ఎప్పుడూ ఇతర నగరాల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. నేడు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,720 గా ఉంది. నిన్నటి ధర రూ.1,52,730 తో పోలిస్తే రూ. 10 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి రూ. 1,40,000 తో పోలిస్తే పది రూపాయలు తగ్గి రూ. 1,39,990 వద్ద విక్రయించబడుతోంది.

ధరల తగ్గుదలకు కారణాలేంటి?

గత కొంతకాలంగా బంగారం ధరలు రెండు లక్షల రూపాయల దిశగా పరుగులు తీస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు నేరుగా పసిడిపై ప్రభావం చూపుతున్నాయి. నేడు ధరలు కేవలం పది రూపాయల మేరకే తగ్గినప్పటికీ, వరుసగా పెరుగుతున్న రేట్లు కాస్త నెమ్మదించడం కొనుగోలుదారులలో ఆశలు రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News