రెపోరేటు అంటే ఏమిటీ.. దీని ప్రభావం ఈఎంఐపై ఎందుకు పడుతుంది..!

What is Reporate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును ప్రకటించింది.

Update: 2023-02-09 09:30 GMT

రెపోరేటు అంటే ఏమిటీ.. దీని ప్రభావం ఈఎంఐపై ఎందుకు పడుతుంది..!

What is Reporate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి నిర్ణయించినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు EMI కూడా పెరుగుతుంది. రివర్స్ రెపో రేటు 3.35 శాతంలో ఎలాంటి మార్పు లేదు. అయితే చాలామందికి రెపోరేటు అంటే ఏంటో తెలియదు. ఇది ఈఎంఐని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

రెపో రేటు అంటే ఏమిటి?

డబ్బు కొరత ఉన్నప్పుడు దేశంలోని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి కొంత మొత్తం డబ్బు అప్పుగా తీసుకుంటాయి. రెపో రేటు అనేది ఈ వాణిజ్య బ్యాంకుల రుణాలపై విధించే వడ్డీ రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ద్రవ్య అధికారులు ఈ రేటును ఉపయోగిస్తారు. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకి తక్కువ రుణాలు ఎక్కువ వడ్డీతో మంజూరుచేస్తాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుంది. పెరిగిన రేట్లకు రుణం తీసుకుంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును తగ్గిస్తుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు డబ్బును రుణాలుగా ఇవ్వడానికి ప్రోత్సహిస్తుంది. దీంతో బ్యాంకులు ఖాతాదారులకి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరుచేస్తాయి. ఇది డబ్బు సరఫరాను పెంచుతుంది. అయితే ఆర్‌బీఐ ద్వారా రెపో రేటు పెంచినప్పుడల్లా బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇచ్చే రుణాల వడ్డీ రేటును పెంచుతాయి. దీని ప్రత్యక్ష ప్రభావం సామాన్యుల జేబుపై పడి రుణ వడ్డీ రేటు పెరుగుతుంది. దీంతో ఈఎంఐ కూడా పెరుగుతుంది.

Tags:    

Similar News