New Passport Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనల్లో భారీ మార్పులు: ఈ నెల 15 నుంచే అమలు.. ఆ తప్పులు చేస్తే దరఖాస్తు రిజెక్టే!
New Passport Rules 2026: దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను మరింత సరళీకరిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
New Passport Rules 2026: పాస్‌పోర్ట్ నిబంధనల్లో భారీ మార్పులు: ఈ నెల 15 నుంచే అమలు.. ఆ తప్పులు చేస్తే దరఖాస్తు రిజెక్టే!
New Passport Rules 2026: దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను మరింత సరళీకరిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతను పటిష్టం చేయడంతో పాటు, సామాన్యులకు దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు కలగకుండా రూపొందించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15 నుండి అమల్లోకి రానున్నాయి.
డిజిటలైజేషన్‌కు పెద్దపీట:
కొత్త రూల్స్ ప్రకారం పేపర్ వర్క్‌ను గణనీయంగా తగ్గించారు. ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఇతర డిజిటల్ గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. దరఖాస్తుదారులు పదేపదే పాస్‌పోర్ట్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేశారు.
వేగంగా పోలీసు వెరిఫికేషన్:
గతంలో వారాల తరబడి పట్టే పోలీసు ధృవీకరణ ప్రక్రియను ఇకపై డిజిటల్ విధానంలో కొద్ది రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. కొన్ని అత్యవసర కేసుల్లో 'పోస్ట్-ఇష్యూ వెరిఫికేషన్' (పాస్‌పోర్ట్ జారీ చేసిన తర్వాత ధృవీకరణ) సౌకర్యాన్ని కూడా కల్పించారు. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది.
యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్:
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరఖాస్తుదారులు స్వయంగా ఫారమ్‌లు నింపడం, స్లాట్‌లు బుక్ చేసుకోవడం వంటి పనులను కొత్త పోర్టల్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. రియల్-టైమ్ నోటిఫికేషన్ల ద్వారా దరఖాస్తు ఏ దశలో ఉందో ట్రాక్ చేసే వెసులుబాటు కల్పించారు. మైనర్ల పాస్‌పోర్ట్ జారీలోనూ నిబంధనలను సరళీకరించారు.
అధికారుల హెచ్చరిక:
ప్రక్రియ సులభతరం అయినప్పటికీ, తప్పుడు పత్రాలు సమర్పిస్తే దరఖాస్తులు వెనువెంటనే తిరస్కరణకు గురవుతాయని అధికారులు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల వారికి సేవలు అందుబాటులో ఉంచేందుకు మరిన్ని పాస్‌పోర్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.