ట్రంప్‌కు షాక్ ..బెంగళూరుకు 'గూగుల్' .. 20 వేల జాబ్స్ రెడీ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కలల సౌధం అమెరికా ఇప్పుడు ఒక సవాలుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక H-1B వీసా నిబంధనలను ఉచ్చులా బిగిస్తుండటంతో, టెక్ దిగ్గజం గూగుల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2026-02-05 05:44 GMT

ట్రంప్‌కు షాక్ ..బెంగళూరుకు 'గూగుల్' .. 20 వేల జాబ్స్ రెడీ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కలల సౌధం అమెరికా ఇప్పుడు ఒక సవాలుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక H-1B వీసా నిబంధనలను ఉచ్చులా బిగిస్తుండటంతో, టెక్ దిగ్గజం గూగుల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో భారతీయులకు తలుపులు మూస్తుంటే.. గూగుల్ నేరుగా భారత్‌లోనే తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి సిద్ధమైంది. ఫలితంగా, సిలికాన్ వ్యాలీ గ్లోరీ ఇప్పుడు బెంగళూరు వీధుల్లో కనిపించబోతోంది.

బెంగళూరులోని టెక్ గుండెకాయ వంటి వైట్‌ఫీల్డ్ కారిడార్‌లో గూగుల్ తన భారీ అడుగు వేసింది. అలెంబిక్ సిటీలో ఏకంగా 2.4 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు ఆకాశహర్మ్యాల్లో గూగుల్ ఆఫీసులు కొలువుదీరనున్నాయి.ఇప్పటికే ఒక టవర్ సిద్ధంగా ఉంది, రాబోయే కొద్ది నెలల్లోనే ఇక్కడ కీబోర్డ్ చప్పుళ్లు వినిపించబోతున్నాయి.

ప్రస్తుతం భారత్‌లో గూగుల్‌కు 14 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఈ కొత్త మెగా క్యాంపస్‌తో మరో 20 వేల మంది యాడ్ కాబోతున్నారు. అంటే గూగుల్ ఇండియా బలం 34 వేలకు చేరుతుంది. అమెరికాకు మన మేధస్సును ఎగుమతి చేయడం కంటే, మన దేశంలోనే ఆ టాలెంట్‌ను వాడుకోవడం కంపెనీకి లాభసాటిగా మారింది.

ట్రంప్ సర్కార్ వీసా నిబంధనలు టెక్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో 2 నుండి 5 వేల డాలర్లుగా ఉన్న H-1B వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా 1 లక్ష డాలర్లకు (రూ. 84 లక్షలు) పెంచాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది.సోషల్ మీడియా స్క్రీనింగ్, ఇంటర్వ్యూలలో జాప్యం కంపెనీలకు భారంగా మారాయి. అమెరికాలో ఒక ఇంజనీర్‌కు ఇచ్చే జీతం, వీసా ఖర్చులు కలిపితే.. అదే టాలెంట్ భారత్‌లో చాలా తక్కువ వ్యయంతో లభిస్తోంది.

ఈ క్యాంపస్ కేవలం సర్వీస్ సెంటర్ కాదు, ఇది ప్రపంచపు టెక్ భవిష్యత్తును డిజైన్ చేసే కేంద్రం. ఇక్కడ ప్రధానంగా..గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ఇక్కడి నుండే పెంచనుంది.గూగుల్ సొంత చిప్‌ల తయారీకి ఇక్కడి ఇంజనీర్లే కీలకం కానున్నారు. మనం వాడుతున్న జెమిని వంటి అధునాతన టూల్స్ ఇక్కడ తయారవుతాయి.

ఒకప్పుడు ఉద్యోగం కోసం అమెరికా వెళ్లడం స్టేటస్.. కానీ ఇప్పుడు గూగుల్ వంటి సంస్థలే బెంగళూరుకు రావడం రియాలిటీ. ట్రంప్ వీసా ఆంక్షలు అమెరికాకు నష్టం కలిగించవచ్చు కానీ, భారత్‌ను మాత్రం గ్లోబల్ టెక్ హబ్‌గా మారుస్తున్నాయి.

Tags:    

Similar News