Gold and Silver Prices: బంగారం రూ.6 వేలు జంప్‌, వెండి రూ.14 వేలు పెరిగింది.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల దూకుడు

Gold and Silver Prices: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం రూ.6 వేల పెరుగుదలతో రూ.1,64,400కు చేరగా, వెండి కిలో ధర రూ.14 వేల పెరిగి రూ.2,93,900కు చేరింది.

Update: 2026-02-04 07:01 GMT

Gold and Silver Prices: బంగారం రూ.6 వేలు జంప్‌, వెండి రూ.14 వేలు పెరిగింది.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల దూకుడు

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.6 వేల పెరుగుదలతో రూ.1,64,400కు చేరుకుంది. నిన్న రూ.1,58,500గా ఉన్న ధరతో పోలిస్తే భారీ పెరుగుదల నమోదైంది.

అలాగే వెండి ధరలు కూడా ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. నిన్న రూ.2,79,600గా ఉన్న కిలో వెండి ధర ఈరోజు రూ.14 వేల పెరిగి రూ.2,93,900కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విలువైన లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. రెండు రోజుల క్రితం లాభాల స్వీకరణ కారణంగా భారీగా పడిపోయిన ధరలు, తాజాగా మళ్లీ పుంజుకుంటున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు 5,080 డాలర్లు, వెండి 87.95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి వైపు ఇన్వెస్టర్లు మళ్లీ మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News