LPG vs Induction: వంట ఖర్చులో భారీ తేడా… తాజా రిపోర్ట్ చెప్పిన నిజాలు!
LPG vs Induction: భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ కొరత, ధరల పెరుగుదలతో ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాల కోసం ఎదురుచూస్తున్నారు.
LPG vs Induction: వంట ఖర్చులో భారీ తేడా… తాజా రిపోర్ట్ చెప్పిన నిజాలు!
LPG vs Induction: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో భారతదేశంలో ఎల్పీజీ సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక నగరాల్లో సిలిండర్ డెలివరీ ఆలస్యం అవుతోంది. ఈ కారణంగా వినియోగదారులు ఇండక్షన్, ఎలక్ట్రిక్ స్టౌవ్‌ల వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా చిన్న హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు అధిక ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నాయి.
2026 రిపోర్ట్‌లో కీలక విషయాలు..
ఐఐఎస్డీ 2026 నివేదికలో ఎల్పీజీ, పీఎన్జీ, విద్యుత్ వంట ఖర్చులను పోల్చుతూ ఈ నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం, భారతీయ కుటుంబాలకు విద్యుత్తుతో వంట చేయడం అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆప్షన్‌గా నిలిచింది. ఇండక్షన్ కుక్టాప్స్, ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లు మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి.
ఎల్పీజీలో వృథా ఎక్కువ – ఇండక్షన్‌తో ఆదా ఎక్కువ..
అంతర్జాతీయ సంస్థ క్లాస్ప్ (CLASP) ప్రకారం, ఇండక్షన్ స్టౌవ్‌లో ఉత్పత్తి అయ్యే శక్తిలో 80-85% నేరుగా వంటకు ఉపయోగపడుతుంది. కానీ ఎల్పీజీ స్టౌవ్‌లో ఇది కేవలం 45-55% మాత్రమే. మిగిలిన వేడి గాలిలో కలిసిపోతుంది. ఈ క్రమంలో ఎల్పీజీ ఎక్కువగా ఖర్చవుతుంది.
ఇండక్షన్‌లో వంట వేగంగా..
ఇండక్షన్ స్టౌవ్ వేగంగా హీట్ చేస్తుంది. కాబట్టి వంట త్వరగా పూర్తవుతుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. ఎల్పీజీతో పోలిస్తే సమయం కూడా ఆదా అవుతుంది.
ఖర్చులో తేడా ఎంత?
ప్రస్తుత ధరల ప్రకారం:
ఎల్పీజీ సిలిండర్ (14.2 కిలోలు): రూ. 960లు
పీఎన్జీ: రూ. 50/ఎస్సీఎం
విద్యుత్: రూ. 6/kwh
పీఎంయూవై కిందకు వచ్చే కుటుంబాలకు ఎల్పీజీ/పీఎన్జీతో వంట చేసేంుదకు సంవత్సరానికి రూ. 6,800 - రూ.6,900 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇండక్షన్ వాడితే రూ.5,800-రూ.5,900 వరకు తగ్గుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ.1,000 వరకు ఆదా అవుతోంది.
వంట ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇండక్షన్ స్టౌవ్ మంచి ఎంపికగా మారుతోంది. తక్కువ ఖర్చుతో పాటు వేగంగా వంట చేయడానికి ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది.