Union Budget 2026 Live Updates: పార్లమెంట్​లో నిర్మల బడ్జెట్​ ప్రసంగం.. లైవ్ అప్ డేట్స్

Update: 2026-02-01 02:46 GMT
Live Updates - Page 4
2026-02-01 05:08 GMT

Union Budget 2026 Live Updates: బడ్జెట్ కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. పార్లమెంట్‌కు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా

కొన్ని నిమిషాల్లో బడ్జెట్‌

మరికొద్ది సేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

పార్లమెంట్‌కు నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు.




 

సాంప్రదాయానికి ప్రాధాన్యం

వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు, అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సంప్రదాయంగా చక్కెర–పెరుగు మిశ్రమాన్ని తినిపించారు.

2026-02-01 03:44 GMT

Union Budget 2026 Live Updates: ఈ బడ్జెట్‌‌లో హెల్త్‌కేర్, ఫార్మా ఆశలేంటి?

కేంద్రం ఆరోగ్య రంగంలో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగాన్ని పెంచే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా రోగులను వేగంగా గుర్తించడం, చికిత్సను సమర్థవంతంగా చేయడం సులభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోగ నిర్ధారణ ఖర్చులు ఎక్కువగా ఉన్నందున, వాటిని తగ్గించడంపై కూడా బడ్జెట్‌లో దృష్టి ఉండవచ్చు.

అలాగే, నాణ్యమైన మందుల తయారీకి ప్రోత్సాహకాలు కల్పించాలనే ఫార్మా కంపెనీల అభ్యర్థనలు కూడా ఉన్నాయి. కొత్త వ్యాధులపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆర్థిక ఊతాన్ని అందించాలన్న డిమాండ్ కూడా కేంద్రం ముందు ఉంది. ఈ బడ్జెట్‌లో కేంద్రం ఆరోగ్య మరియు ఫార్మా రంగాలను ఎట్లా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.

2026-02-01 03:05 GMT

Union Budget 2026 Live Updates: బంగారంపై ట్యాక్స్ తగ్గింపు.. బడ్జెట్ తర్వాత భారీగా తగ్గనున్న ధరలు?

బంగారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. యూనియన్ బడ్జెట్‌లో బంగారంపై ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే, పసిడి ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

2026-02-01 03:00 GMT

Union Budget 2026 Live Updates: ఈసారి బడ్జెట్‌లో ఈ రంగాలపై ఎక్కువ ఫోకస్

గ్రీన్ ఎనర్జీ, డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ అగ్రికల్చర్ వంటి కీలక రంగాలపై ఈ బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా సోలార్, విండ్ ఎనర్జీ వంటి పునరుత్పాదక శక్తి వనరులను మరింతగా ప్రోత్సహించే అవకాశముంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానాన్ని లక్ష్యంగా భారత్ ముందుకెళ్తున్న నేపథ్యంలో, ఈ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇవ్వవచ్చని అంచనా. అదేవిధంగా ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమంలో భాగంగా మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేసే చర్యలు ప్రకటించే అవకాశం ఉంది.

వ్యవసాయ రంగంలో డ్రోన్లు, ఆధునిక యంత్ర సాంకేతికత వినియోగాన్ని విస్తరించేందుకు కూడా బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు కల్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

2026-02-01 02:57 GMT

Union Budget 2026 Live Updates: పీఎం కిసాన్ సాయాన్ని పెంచే అవకాశం

దేశంలోని రైతులకి ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న రూ. 6000 సాయాన్ని పెంచే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

2026-02-01 02:54 GMT

Union Budget 2026 Live Updates: స్టాక్​ మార్కెట్​ నిపుణుల హెచ్చరిక

బడ్జెట్ రోజున ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారు ఆచితూచి వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

2026-02-01 02:51 GMT

Union Budget 2026 Live Updates: ఆదివారం బడ్జెట్.. పనిచేయనున్న స్టాక్ మార్కెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆదివారమైనా కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో ఈరోజు సెలవు అయినప్పటికీ.. స్టాక్ మార్కెట్ కూడా ఓపెన్ అవుతుంది. బడ్జెట్ ఎలా ఉంది అనేది స్టాక్ మార్కెట్లు ప్రతిబింబిస్తాయి. అందువల్ల ఇవాళ పనిచేసే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు.. నిర్మలమ్మ పద్దును బట్టీ ప్రభావితం అవుతాయి. 

Tags:    

Similar News