Stock market holiday: హొలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు
Stock market holiday: హోలీ పండుగ సందర్భంగా మార్చి 3, 2026న స్టాక్ మార్కెట్లకు సెలవు. మార్చి 4న తిరిగి ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలు ఇవే..
Stock market holiday
Stock market holiday: హొలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్ కు ఈరోజు సెలవు అనే అంశంలో ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కి సందేహం ఉంది. మార్చి 3 లేదా 4 ఈరోజు స్టాక్ మార్కెట్ పనిచేయదు అనే అయోమయం అందరిలోనూ ఉంది. అయితే, హోలీ పండుగను పురస్కరించుకుని, మార్చి 3, 2026, మంగళవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు (బిఎస్‌ఇ - ఎన్‌ఎస్‌ఇ) మూతపడనున్నాయి. ఈ మేరకు ఎక్స్ఛేంజ్ సెలవుల జాబితా ప్రకారం మార్ఛి 3వ తేదీ అంటే మంగళవారం స్టాక్ మార్కెట్ పనిచేయదు. ఈ రోజున ఈక్విటీలు మరియు ఇతర విభాగాల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఎక్స్ఛేంజ్ తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 3న దలాల్ స్ట్రీట్ సెలవు ప్రకటించడంతో, మార్కెట్ కార్యకలాపాల్లో భాగం పంచుకునే వారికి ఆ రోజున విరామం లభించనుంది. మార్చి 4న మాత్రం మార్కెట్లు తిరిగి యథావిధిగా ప్రారంభమవుతాయి.
Stock market holiday: సాధారణంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఈక్విటీల విభాగంలో ట్రేడింగ్ శని, ఆదివారాలు, ఎక్స్ఛేంజ్ ప్రకటించిన ప్రత్యేక సెలవులు మినహా, వారంలోని అన్ని పని దినాల్లో జరుగుతుంది. మార్కెట్ పని చేసే రోజుల్లో ట్రేడింగ్ సమయాలు నిర్ణీత నిబంధనల ప్రకారం ఉంటాయి. ఆర్డర్ ఎంట్రీ - సవరణ కోసం ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 09:00 గంటల నుండి 09:08 గంటల వరకు జరుగుతుంది. దీని తర్వాత చివరి నిమిషంలో యాదృచ్ఛిక ర్యాండమ్ క్లోజింగ్ (Random Closure) ఉంటుంది. ఆపై ప్రీ-ఓపెన్ ఆర్డర్ మ్యాచింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
రెగ్యులర్ ట్రేడింగ్ సెషన్ ప్రతిరోజూ ఉదయం 09:15 గంటల నుండి మధ్యాహ్నం 15:30 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే, క్లోజింగ్ సెషన్ (Closing Session) మధ్యాహ్నం 15:40 గంటల నుండి సాయంత్రం 16:00 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయాల్లోనే ప్రధాన లావాదేవీలు పూర్తవుతాయి.
Stock market holiday: అదే సమయంలో, బ్లాక్ డీల్ సెషన్ రెండు విండోలలో పనిచేస్తుంది. ఉదయం విండో ఉదయం 08:45 AM నుండి 09:00 AM వరకు అలాగే, మధ్యాహ్నం విండో మధ్యాహ్నం 02:05 PM నుండి 02:20 PM వరకు అందుబాటులో ఉంటుంది. ట్రేడర్లు ఈ సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలి.
2026 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన సెలవుల జాబితాను ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పెట్టుబడిదారులు రాబోయే సెలవుల గురించి ముందస్తు సమాచారం కోసం ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండాలి. హోలీ సెలవు తర్వాత, మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం మార్కెట్లు మళ్లీ సాధారణంగా ప్రారంభమవుతాయి.
ఇక ఈ ఏడాది స్టాక్ మార్కెట్ కు ఏరోజు సెలవులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు..