New Financial Rules: సామాన్యులకు షాక్.. నేటి నుంచే కొత్త రూల్స్.. పూర్తి వివరాలివే!
New Financial Rules: నేటి నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నెల ప్రారంభమైంది. బడ్జెట్ ప్రతిపాదనలు, ఆర్‌బీఐ (RBI) కొత్త ఆదేశాలు, చమురు ధరల సవరణల నేపథ్యంలో నేటి నుంచి ఆర్థిక నిబంధనల్లో పలు మార్పులు అమల్లోకి వస్తున్నాయి.
New Financial Rules: సామాన్యులకు షాక్.. నేటి నుంచే కొత్త రూల్స్.. పూర్తి వివరాలివే!
New Financial Rules: నేటి నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నెల ప్రారంభమైంది. బడ్జెట్ ప్రతిపాదనలు, ఆర్‌బీఐ (RBI) కొత్త ఆదేశాలు, చమురు ధరల సవరణల నేపథ్యంలో నేటి నుంచి ఆర్థిక నిబంధనల్లో పలు మార్పులు అమల్లోకి వస్తున్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
* మార్చి 31న బ్యాంకులు తెరిచే ఉంటాయి:
ఈ ఏడాది మార్చి 31న 'మహావీర్ జయంతి' కారణంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంవత్సర ముగింపు (Year-ending) కావడంతో, పన్ను వసూల్లు, ప్రభుత్వ లావాదేవీల కోసం అన్ని ఏజెన్సీ బ్యాంకులు మార్చి 31 (మంగళవారం) నాడు తెరిచి ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
* ఆర్థిక స్కామ్‌లకు చెక్: '1600' సిరీస్:
టెలికాం రెగ్యులేటరీ (TRAI) కొత్త నిబంధన ప్రకారం, స్టాక్ బ్రోకర్లు అందరూ మార్చి 15 లోపు తమ కాలింగ్ వ్యవస్థను '1600' సిరీస్‌కు మార్చుకోవాలి. దీంతో ప్రయోజనం ఏమిటంటే.. ఇకపై మీకు మీ బ్రోకర్ నుంచి కాల్ వస్తే అది '1600'తో ప్రారంభమవ్వాలి. ఒకవేళ సాధారణ 10 అంకెల నంబర్ నుంచి వస్తే, అది స్కామ్ లేదా ఫ్రాడ్ కాల్ అని సులభంగా గుర్తించవచ్చు.
* ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR): సవరణకు ఛాన్స్:
2026-27 బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు ఒక పెద్ద ఊరటనిచ్చింది. గతంలో డిసెంబర్ 31తో ముగిసిన సవరించిన ఐటీఆర్ (Revised ITR) దాఖలు గడువును ఇప్పుడు మార్చి 31 వరకు పొడిగించారు. మీ 2025-26 డిక్లరేషన్లలో ఏవైనా తప్పులు ఉంటే, నామమాత్రపు రుసుముతో ఈ నెలాఖరులోపు సరిదిద్దుకోవచ్చు.
* ఫాస్టాగ్ (FASTag) నిబంధనల సరళీకరణ:
నేషనల్ హైవే అథారిటీ (NHAI) ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఇకపై సాధారణ KYV (Know Your Vehicle) ధృవీకరణ అవసరం లేదు (ఫిర్యాదులు ఉన్న సందర్భాల్లో తప్ప). మార్చి 3 నుంచి డిజిటల్ వాలెట్ల వినియోగదారుల కోసం టోల్ నిధులను విడిగా నిర్వహించేందుకు 'సబ్-వాలెట్' సౌకర్యం అందుబాటులోకి రానుంది.
* గ్యాస్ & విమాన ఇంధన ధరల మోత:
చమురు సంస్థలు వాణిజ్య అవసరాలకు వాడే ఇంధన ధరలను పెంచాయి. వరుసగా మూడవ నెల కూడా కమర్షియల్ గ్యాస్ ధర పెరిగింది. ఢిల్లీలో రూ.188, కోల్‌కతాలో రూ.191.5 వరకు ధరలు పెరిగాయి. అయితే, గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు. ఇదే సమయంలో విమాన ఇంధన ధరలు 5-6 శాతం పెరిగాయి. చెన్నైలో కిలోలీటర్ ధర రూ.1 లక్ష దాటింది. దీనివల్ల విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.