New Rules March 1: మార్చి 1 నుంచి కొత్త నియమాలు.. మీ జేబుపై ప్రభావం?
New Rules March 1: మార్చి 1 నుంచి LPG, CNG ధరలు, రైల్వే UTS యాప్ నిలిపివేత, సిమ్-బైండింగ్ వంటి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి ప్రజలపై ప్రభావం చూపనున్నాయి.
New Rules March 1: మార్చి 1 నుంచి కొత్త నియమాలు.. మీ జేబుపై ప్రభావం?
ఫిబ్రవరి నెల ముగియడంతో మార్చి కొత్త నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల ప్రారంభంలో కొన్ని ఆర్థిక, సాంకేతిక మరియు పరిపాలనా నిబంధనలు మారుతూ ఉంటాయి. ఇదే విధంగా మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా కొన్ని కీలక నియమాలు అమల్లోకి రానున్నాయి. ఇవి సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపే అవకాశముంది.
LPG సిలిండర్ ధరలు: ప్రతి నెల మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. మార్చి 1న కూడా కొత్త ధరలు ప్రకటించే అవకాశం ఉంది. గ్యాస్ ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.
CNG, PNG, ATF ధరలు: ఎల్‌పీజీతో పాటు సిఎన్‌జీ, పిఎన్‌జీ, విమాన ఇంధనం (ATF) ధరలు కూడా ప్రతి నెలా సవరించబడుతుంటాయి. మార్చి 1 నుంచి ఈ ఇంధనాల ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
రైల్వే పాత UTS యాప్ నిలిపివేత: భారతీయ రైల్వే పాత UTS మొబైల్ యాప్‌ను మార్చి 1 నుండి నిలిపివేయనుంది. ఇకపై ప్రయాణికులు ‘RailOne’ అనే కొత్త యాప్ ద్వారా రిజర్వేషన్ లేని టిక్కెట్లు, జనరల్ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సిమ్-బైండింగ్ కొత్త నిబంధనలు: మొబైల్ వినియోగదారుల కోసం కొత్త సిమ్-బైండింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మెసేజింగ్ యాప్ ఖాతాలను యాక్టివ్ సిమ్ కార్డుతో అనుసంధానం చేయడం తప్పనిసరి కానుంది. ఖాతా నమోదు చేసే మొబైల్ నంబర్ అదే ఫోన్‌లో యాక్టివ్ సిమ్‌గా ఉండాల్సి ఉంటుంది.
ఈ మార్పులపై సంబంధిత విభాగాలు అధికారిక ప్రకటనలు విడుదల చేయనున్నాయి.