Petrol Price Today: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price Today: దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2021-03-20 07:08 GMT

పెట్రోల్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 2.01 శాతం పెరుగుదలతో 64.55 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.43 శాతం పెరుగుదలతో 61.46 డాలర్లకు ఎగసింది.

దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీ ఇంధన ధరలు నిలకడగా ఉండటం ఇది వరుసగా 21వ రోజు కావడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.91.17 వుండగా డీజిల్ ధర రూ.81.47 వద్ద నిలకడగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.97.57 వుండగా డీజిల్ ధర రూ.88.60 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర రూ.94.79 వద్ద, డీజిల్ ధర రూ.88.86 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.97.38 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర రూ.90.90 వద్ద నిలకడగా ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.96.95 ఉండగా డీజిల్ ధర రూ.90.50 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

Tags:    

Similar News