మార్పు లేని పెట్రోల్, డీజిల్ ధరలు

అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు పెరిగాయి. అయినప్పటికీ, నాలుగు రోజులుగా దేశీయంగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.

Update: 2019-09-16 02:59 GMT

అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు పెరిగాయి. అయినప్పటికీ, నాలుగు రోజులుగా దేశీయంగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం వున్న ధరలే సోమవారమూ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 76.57, డీజిల్ 71.33 రూపాయలుగా ఉన్నాయి. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 76.31రూపాయలు, డీజిల్ ధర 70.73రూపాయల వద్ద నిలకడగా ఉండగా, విజయవాడలోనూ పెట్రోల్ ధర రూ.75.94, డీజిల్ ధర రూ.70.38గానే ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థతి ఉంది. ముంబయిలో పెట్రోల్ ధర 77.71రూపాయలు, డీజిల్ 68.62రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 72.03రూపాయలుగానూ, డీజిల్ ధర 65.43రూపాయలుగానూ స్థిరంగా ఉన్నాయి.

ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 11.64 శాతం పెరుగుదలతో 67.23 డాలర్లకు పెరగగా, ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 10.41 శాతం పెరుగుదలతో 60.56 డాలర్లకు చేరుకుంది. 

Tags:    

Similar News