మెట్రోనగరాల్లో స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు

Update: 2021-03-02 05:39 GMT

మెట్రోనగరాల్లో స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు 

Petrol and Diesel prices today 02 March 2021: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా, నికడగా కొనసాగుతున్నాయి. పెట్రోలియం సరఫరా కంపెనీల రోజువారీ ధరల సమీక్ష ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ ఎగువన కొనసాగుతోంది. ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

గత పది రోజుల్లో పెట్రోల్ ధర నాలుగు రూపాయల 87 పైసలు , డీజిల్ ధర 4 రూపాయల 99 పైసలు చొప్పున పెరిగింది. మరోవైపు రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి 101 రూపాయల 59 పైసలు వద్దకు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17 పైసలు, డీజిల్ 81 రూపాయల 47 పైసలు వద్దకు చేరాయి. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 57 పైసలు వద్దకు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు డీజిల్ 88 రూపాయల 86 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News