మీ భార్య పేరుపై ఈ ఖాతా తెరవండి.. ప్రతి నెలా రూ. 44,793 సంపాదించండి..!

National Pension Scheme: ఇంట్లో మీరు లేనప్పుడు సాధారణ ఆదాయం ఉండేలా మీ భార్య ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలంటే ఆమెకు రెగ్యులర్ ఆదాయం ఏర్పాటు చేయాలి.

Update: 2022-04-05 13:30 GMT

మీ భార్య పేరుపై ఈ ఖాతా తెరవండి.. ప్రతి నెలా రూ. 44,793 సంపాదించండి..!

National Pension Scheme: ఇంట్లో మీరు లేనప్పుడు సాధారణ ఆదాయం ఉండేలా మీ భార్య ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలంటే ఆమెకు రెగ్యులర్ ఆదాయం ఏర్పాటు చేయాలి. దీని కోసం మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో(NPS) పెట్టుబడి పెడితే మంచిది. మీరు మీ భార్య పేరుపై కొత్త పెన్షన్ ఖాతాను తెరవవచ్చు. NPS ఖాతా మీ భార్యకు 60 ఏళ్లు నిండిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు అందజేస్తుంది. దీంతో పాటు ప్రతి నెలా వారికి పింఛను రూపంలో సరైన ఆదాయం అందిస్తుంది. ఇది మాత్రమే కాదు NPS ఖాతాతో మీరు మీ భార్యకు ప్రతి నెల ఎంత పెన్షన్ పొందాలో కూడా నిర్ణయించవచ్చు. దీంతో మీ భార్య 60 ఏళ్లు దాటిన తర్వాత డబ్బు కోసం ఎవరిపైనా ఆధారపడదు. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

పెట్టుబడి పెట్టడం చాలా సులభం

మీరు కొత్త పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాలో మీ సౌలభ్యం ప్రకారం ప్రతి నెల లేదా సంవత్సరానికి డబ్బు జమ చేయవచ్చు. కేవలం రూ.1,000తో మీ భార్య పేరుపై ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరవవచ్చు. NPS ఖాతా 60 సంవత్సరాల వయస్సులో మెచ్యూర్ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం కావాలంటే 65 సంవత్సరాల వరకు కూడా NPS ఖాతాను అమలు చేయవచ్చు.

45 వేల వరకు నెలవారీ ఆదాయం

ఉదాహరణకు మీ భార్యకు 30 ఏళ్లు ఉంటే మీరు ఆమె NPS ఖాతాలో ప్రతి నెలా రూ. 5000పెట్టుబడి పెట్టండి. ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి వస్తే 60 ఏళ్ల వయసులో ఆమె ఖాతాలో మొత్తం రూ.1.12 కోట్లు ఉంటాయి. ఇందులో దాదాపు 45 లక్షల రూపాయలు వారికి అందుతాయి. ఇది కాకుండా వారు ప్రతి నెలా దాదాపు రూ.45,000 పింఛను పొందడం ప్రారంభిస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వారు జీవితాంతం ఈ పెన్షన్ పొందుతూనే ఉంటారు.

NPS అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. ఈ స్కీమ్‌లో మీరు పెట్టుబడి పెట్టే డబ్బుని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. వృత్తిపరమైన ఫండ్ మేనేజర్లకు కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగిస్తుంది. ఈ పరిస్థితిలో NPSలో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. అయితే ఈ పథకం కింద మీరు పెట్టుబడి పెట్టే డబ్బుపై రాబడికి హామీ లేదు. ఫైనాన్షియల్ ప్లానర్ల ప్రకారం, ఎన్‌పిఎస్ ప్రారంభమైనప్పటి నుంచి సగటున 10 నుంచి 11 శాతం వార్షిక రాబడిని అందించింది. 

Tags:    

Similar News