రోజుకి రూ.200 పొదుపు మీ భవిష్యత్‌కి మలుపు.. ప్రతిఫలంగా రూ.28 లక్షల ఫండ్‌..!

Lic Jeevan Pragati Plan: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

Update: 2022-09-17 14:00 GMT

రోజుకి రూ.200 పొదుపు మీ భవిష్యత్‌కి మలుపు.. ప్రతిఫలంగా రూ.28 లక్షల ఫండ్‌..!

Lic Jeevan Pragati Plan: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. కంపెనీ ప్రతి వర్గానికి అనుకూలంగా ఉండే పాలసీలని రూపొందిస్తుంది. అంతేకాకుండా మహిళలు, ఉద్యోగులు, పిల్లలు మొదలైన వారికి ప్రత్యేక పాలసీలు ఉంటాయి. అయితే రోజుకి రూ.200 పెట్టుబడితో రూ.28 లక్షల ఫండ్‌ క్రియేట్ చేయవచ్చు. దీనికి ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్‌ పొదుపు, భద్రత రెండింటి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పాలసీని కంపెనీ 3 ఫిబ్రవరి 2016న ప్రారంభించింది. ఇందులో ప్రతి నెలా రూ.6,000 పెట్టుబడి పెట్టాలి. 20 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై 28 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందుతారు.

పాలసీ వివరాలు

కనీస హామీ మొత్తం – రూ 1,50,000

గరిష్ట హామీ మొత్తం - పరిమితులు లేవు

పాలసీ వ్యవధి 12 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి.

పాలసీని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు - 12 సంవత్సరాలు

పాలసీని కొనుగోలు చేయడానికి గరిష్ట వయస్సు - 45 సంవత్సరాలు

పాలసీ మెచ్యూరిటీ గరిష్ట వయస్సు - 65 సంవత్సరాలు

మరణ ప్రయోజనం పొందుతారు

ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్‌లో పెట్టుబడిదారుడు మరణ ప్రయోజనం పొందుతాడు. డెత్ బెనిఫిట్ మొత్తం పాలసీ ఎంత పాతది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పాలసీని కొనుగోలు చేసిన 5 సంవత్సరాల తర్వాత పాలసీదారు మరణిస్తే అతను మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. బీమాను కొనుగోలు చేసిన 5 సంవత్సరాలలోపు పాలసీదారు మరణిస్తే అతని కుటుంబానికి హామీ మొత్తం లభిస్తుంది. అదే సమయంలో పాలసీ తీసుకున్న 6 నుంచి 10 సంవత్సరాల మధ్య మరణిస్తే 125% హామీ మొత్తం లభిస్తుంది. 1 నుంచి 15 సంవత్సరాలలో 150%, 16 నుంచి 20 సంవత్సరాలలో 200% హామీ మొత్తం లభిస్తుంది. మీరు రైడర్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News