LIC Policy: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం.. ఏకంగా 28 లక్షల రూపాయలు మీవే..!

LIC Policy: కొత్త సంవత్సరంలో సామాన్యులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ పెట్టుబడి ఎంపికల కోసం వెతుకుతున్నారు.

Update: 2023-01-21 15:30 GMT

LIC Policy: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనం.. ఏకంగా 28 లక్షల రూపాయలు మీవే..!

LIC Policy: కొత్త సంవత్సరంలో సామాన్యులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ పెట్టుబడి ఎంపికల కోసం వెతుకుతున్నారు. అయితే పొదుపు, బీమా రెండింటి ప్రయోజనాన్ని పొందాలనుకునే వారికి ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టడం ఉత్తమ ఎంపిక అవుతుంది. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు.

దేశంలోని అన్ని వర్గాలకి ఎల్‌ఐసీ పాలసీలని రూపొందిస్తుంది. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల బలమైన రాబడిని పొందవచ్చు. ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి బీమా పాలసీలో పెట్టుబడి పెట్టడం వల్ల కొన్ని సంవత్సరాలలో మీరు పెద్ద ఫండ్‌ని క్రియేట్‌ చేయవచ్చు. 12 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు.ఈ పథకంలో మీరు ప్రతి నెల, మూడు నెలలు, 6 నెలల ఆధారంగా ప్రీమియం చెల్లించవచ్చు. ఇందులో పాలసీదారుడు కనీసం రూ.1.5 లక్షల హామీ మొత్తాన్ని పొందుతారు. అదే సమయంలో గరిష్ట హామీ మొత్తంపై పరిమితి లేదు. ఈ పాలసీని 12 నుంచి 20 సంవత్సరాల కాలానికి కొనుగోలు చేయవచ్చు.

28 లక్షల ప్రయోజనం

ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల 28 లక్షల రూపాయల కార్పస్‌ని పొందవచ్చు. ప్రతిరోజూ రూ.200 పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.6,000 పెట్టుబడి పెట్టాలి. ఇలా చేస్తే వార్షిక పెట్టుబడి 72 వేల రూపాయలు అవుతుంది. అంతేకాకుండా ఈ పథకంలో ప్రతి 5 సంవత్సరాల తర్వాత రిస్క్ కవర్ పెరుగుతుంది. మీరు రూ.4 లక్షలకు పాలసీని కొనుగోలు చేస్తే 5 సంవత్సరాల తర్వాత రూ.4 లక్షలకు బదులుగా రూ.5 లక్షల కవర్ పొందుతారు.

10 ఏళ్ల తర్వాత 6 లక్షలకు అదే సమయంలో 20 సంవత్సరాల తర్వాత ఈ పాలసీ 7 లక్షల కవర్ ఇస్తుంది. పాలసీదారుడు పాలసీ పూర్తికాకముందే మరణిస్తే అతని కుటుంబానికి హామీ మొత్తం అలాగే బోనస్ లభిస్తుంది. ఈ పథకం 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు వడ్డీ, బోనస్‌తో కలిపి మొత్తం రూ.28 లక్షల ప్రయోజనాన్ని పొందుతారు.

Tags:    

Similar News