Stock Market: బుల్ జోరు.. లాభాలతో ముగిసిన మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు వీకెండ్ సెషన్ లో లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి.
Stock Market: బుల్ జోరు.. లాభాలతో ముగిసిన మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు వీకెండ్ సెషన్ లో లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 568 పాయింట్లు మేర జంప్ చేయగా, నిఫ్టీ 14,510 మార్క్ దిగువకు చేరింది. అయితే దేశీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 568 పాయింట్లు ఎగసి 49,008 వద్దకు చేరగా నిఫ్టీ 182 పాయింట్లు మేర లాభంతో 14,507 వద్ద స్థిరపడ్డాయి.