Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 10 నుంచి కీలక మార్పులు.. తెలుసుకోకుంటే ఇబ్బందులే..!
Train Time Table Update: రైళ్లకు సంబంధించి అనేక నిర్ణయాలు రైల్వేలు తీసుకుంటాయి. ఇప్పుడు మీరు కూడా రాబోయే రోజుల్లో ఢిల్లీ, పంజాబ్ నుంచి కేరళకు వెళ్లడానికి ఏదైనా ప్లాన్ కలిగి ఉంటే, ఇది మీకు చాలా ముఖ్యమైన వార్త. పలు రైళ్ల వేళలను రైల్వేశాఖ మార్చింది.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జూన్ 10 నుంచి కీలక మార్పులు.. తెలుసుకోకుంటే ఇబ్బందులే..!
Indian Railways New Time Table: రైళ్లకు సంబంధించి అనేక నిర్ణయాలు రైల్వేలు తీసుకుంటాయి. ఇప్పుడు మీరు కూడా రాబోయే రోజుల్లో ఢిల్లీ, పంజాబ్ నుంచి కేరళకు వెళ్లడానికి ఏదైనా ప్లాన్ కలిగి ఉంటే, ఇది మీకు చాలా ముఖ్యమైన వార్త. పలు రైళ్ల వేళలను రైల్వేశాఖ మార్చింది. ఢిల్లీ నుంచి కేరళకు వెళ్లే పలు రైళ్ల షెడ్యూల్‌ను మార్చినట్లు రైల్వేశాఖ తెలిపింది. మీరు ప్రయాణానికి ముందు ఏ రైళ్ల షెడ్యూల్ మార్చారో తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.
జూన్ 10 నుంచి అమల్లోకి..
రైళ్ల షెడ్యూల్‌లో ఈ మార్పు జూన్ 10, 2023 నుంచి అక్టోబర్ 31, 2023 వరకు వర్తిస్తుందని భారతీయ రైల్వే తెలిపింది.
>> రైలు నంబర్ 12617 - ఎర్నాకులం జంక్షన్ - హజ్రత్ నిజాముద్దీన్ దైనిక్ మంగళ లక్షద్వీప్ ఎక్స్‌ప్రెస్ సమయం మార్చారు. ఇప్పుడు ఈ రైలు సమయానికి 3.15 గంటల ముందు బయలుదేరుతుంది. ఈ రైలు ఇప్పుడు ఎర్నాకులం జంక్షన్ నుంచి 10.10కి బయలుదేరుతుంది.
>> రైలు నంబర్ 12618 - హజ్రత్ నిజాముద్దీన్ - ఎర్నాకులం జంక్షన్ మంగళ లక్షద్వీప్ డైలీ ఎక్స్‌ప్రెస్ 10.25 గంటలకు ఎర్నాకులం జంక్షన్ చేరుకుంటుంది.
>> రైలు నంబర్ 12431 తిరువనంతపురం సెంట్రల్ - హజ్రత్ నిజాముద్దీన్ ట్రై-వీక్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ దాని షెడ్యూల్ సమయానికి 4 గంటల 35 నిమిషాలు లేట్‌గా బయలు దేరుతుంది. ఈ రైలు మంగళవారం, గురువారం, శుక్రవారం బయలుదేరుతుంది. ఈ రైలు తిరువనంతపురం సెంట్రల్ నుంచి 14.40 గంటలకు బయలుదేరుతుంది.
>> రైలు నంబర్ - 12483 కొచ్చువేలి-అమృత్‌సర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా 4 గంటల 20 నిమిషాల ముందు బయలుదేరుతుంది.
>> రైలు నంబర్ - 20923 తిరునెల్వేలి జంక్షన్ - గాంధీధామ్ జంక్షన్ వీక్లీ హమ్‌సఫర్ సూపర్‌ఫాస్ట్ 2 గంటల 45 నిమిషాల క్రితం బయలుదేరుతుంది.
>> రైలు నంబర్ 12432 - హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం సెంట్రల్ రాజధాని ఎక్స్‌ప్రెస్ - 2 గంటల 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. ఈ రైలు ఆది, మంగళ, బుధవారాల్లో తిరువనంతపురం సెంట్రల్‌కి 01.50 గంటలకు చేరుకుంటుంది.
>> రైలు నంబర్ 22149 - ఎర్నాకులం జంక్షన్ - పూణే జంక్షన్ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ సమయం కూడా మార్చారు. ఇప్పుడు ఈ రైలు 3 గంటల ముందుగా బయలుదేరుతుంది. ఆది, శుక్రవారాల్లో ఎర్నాకులం జంక్షన్ నుంచి బయలుదేరుతుంది.
>> రైలు నంబర్ - 22655 ఎర్నాకులం జంక్షన్ - హజ్రత్ నిజాముద్దీన్ సూపర్ ఫాస్ట్ రైలు కూడా 3 గంటల ముందు బయలుదేరుతుంది.
>> రైలు నంబర్ - 12217 కొచ్చువేలి-చండీగఢ్ బై-వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా 4 గంటల 20 నిమిషాల ముందు బయలుదేరుతుంది. సోమ, శనివారాల్లో కొచ్చువేలి నుంచి బయలుదేరుతారు.