Gold Rates: మళ్లీ మగువలకు షాక్! వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తూ పసిడి ప్రియులను కలవరపెడుతున్నాయి

బంగారం ప్రేమికులకు మళ్లీ పెద్ద షాక్ తగిలింది. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు, ఈరోజు బుధవారం మాత్రం ఒక్కసారిగా ఎగబాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

Update: 2025-12-10 05:30 GMT

Gold Rates: మళ్లీ మగువలకు షాక్! వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తూ పసిడి ప్రియులను కలవరపెడుతున్నాయి

బంగారం ప్రేమికులకు మళ్లీ పెద్ద షాక్ తగిలింది. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు, ఈరోజు బుధవారం మాత్రం ఒక్కసారిగా ఎగబాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. క్రిస్మస్ దగ్గర్లో ఉండటంతో ధరలు తగ్గుతాయేమో అనుకున్న గోల్డ్ లవర్స్‌కు నిరాశే మిగిలింది. పసిడి, వెండి రెండూ పరుగులు పెడుతూ ధరలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి.

ఈరోజు తులం బంగారం ధర రూ.870 పెరగగా, కిలో వెండి ధర ఏకంగా రూ.9,000 పెరిగింది. దీంతో వెండి ధర రికార్డు స్థాయికి చేరి గృహిణులకు షాకిచ్చింది.

బంగారం ధరలు – ఒక్కరోజులో భారీ జంప్

బులియన్ మార్కెట్ ప్రకారం:

24 క్యారెట్ల (10 గ్రాములు) – రూ.870 పెరిగి ₹1,30,310

22 క్యారెట్ల (10 గ్రాములు) – రూ.800 పెరిగి ₹1,19,450

18 క్యారెట్ల (10 గ్రాములు) – రూ.650 పెరిగి ₹97,730

ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడంతో ఆభరణాలు కొనాలనుకున్నవారు నిరాశ చెందుతున్నారు.

వెండి ధరలు రికార్డు స్థాయికి

బంగారం కన్నా వెండి ధరలు మరింత షాకిచ్చాయి.

హైదరాబాద్‌లో కిలో వెండి – రూ.9,000 పెరిగి ₹2,07,000

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా – కిలో వెండి ₹1,99,000

ఇలాంటి వేగంతో ధరలు పెరగడం వల్ల పండుగ సీజన్‌లో ఆభరణాల కొనుగోలు కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News