Anmol Ambani: అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

Anmol Ambani: వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) మాజీ డైరెక్టర్ జై అన్మోల్ అనిల్ అంబానీపై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది.

Update: 2025-12-09 10:18 GMT

Anmol Ambani: అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

Anmol Ambani: వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుమారుడు, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) మాజీ డైరెక్టర్ జై అన్మోల్ అనిల్ అంబానీపై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు సీబీఐ అధికార వర్గాలు తెలిపాయి. బ్యాంకుకు రూ.228 కోట్ల మేర నష్టం వాటిల్లేలా చేసిన ఆర్థిక వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది.

జై అన్మోల్‌తో పాటు రవీంద్ర శరద్ సుధాకర్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు వివరాల ప్రకారం.. ముంబైలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ నుంచి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ రూ.450 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఈ ఖాతాలపై గ్రాంట్ థోర్నంటన్ ఆడిట్ సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్ పరిశీలనలో నిధులు మళ్లించినట్లు తేలింది.

2016 ఏప్రిల్ 1 నుంచి 2019 జూన్ 30 మధ్య జరిగిన లావాదేవీలను విశ్లేషించగా, రుణం తీసుకున్న మొత్తాన్ని ఇతర అవసరాలకు వినియోగించినట్లు గుర్తించారు. ఈ ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా బ్యాంక్ ఫిర్యాదు చేయడంతో, సీబీఐ తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారం రిలయన్స్ గ్రూప్ సంస్థల ఆర్థిక లావాదేవీల పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

Tags:    

Similar News