రైలులో ఇన్ని కేజీల లగేజీకి మాత్రమే అనుమతి.. ఎక్కువైతే చలాన్‌ తప్పదు..!

Indian Railways: భారతీయ రైల్వే తన ప్రయాణీకుల సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

Update: 2023-03-13 10:21 GMT

రైలులో ఇన్ని కేజీల లగేజీకి మాత్రమే అనుమతి.. ఎక్కువైతే చలాన్‌ తప్పదు..!

Indian Railways: భారతీయ రైల్వే తన ప్రయాణీకుల సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది. అయితే విమానంలో లాగా రైలులో కూడా నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే లగేజీని తీసుకెళ్లవచ్చు. దూర ప్రయాణం సమయంలో ఎక్కువ లగేజీని అనుమతించరు. ఇందుకోసం రైల్వే అధికారులు లగేజీ పరిమితిని విధించారు. అదనపు లగేజీల వల్ల ఇతర ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మీరు రైలులో ఎంత లగేజీని తీసుకువెళ్లవచ్చో ఈరోజు తెలుసుకుందాం.

కొన్ని కారణాల వల్ల ప్రయాణీకలు ఎక్కువ లగేజీని తీసుకువెళ్లవలసి వస్తే దీని కోసం పార్శిల్ కార్యాలయానికి వెళ్లి సామాను బుక్ చేసుకోవాలి. చాలా మంది ప్రయాణికులు ఎక్కువ లగేజీతో ప్రయాణించడం తరచుగా కనిపిస్తుంది. దీని కారణంగా అతను చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా తనతో ప్రయాణిస్తున్న వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఒక్కో కోచ్‌కు ఒక్కో లగేజీ పరిమితిని నిర్ణయించింది.

రైల్వే శాఖ ప్రకారం రైలు కోచ్‌లో ప్రయాణికులు 40 నుంచి 70 కిలోల బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. అదనపు డబ్బు ఖర్చు లేకుండా స్లీపర్ క్లాస్‌లో 40 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చు. అయితే సెకండ్ ఏసీలో 50 కిలోల వరకు, ఫస్ట్ క్లాస్ ఏసీలో 70 కిలోల వరకు బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. అదనంగా రుసుము చెల్లించి 80 కేజీల వరకు కూడా తీసుకెళ్లవచ్చు. ప్రయాణ సమయంలో ఎవరైనా ప్రయాణీకులు నిబంధనలు ఉల్లంఘించినట్లైతే అతను ఛాలన్‌ చెల్లించవలసి ఉంటుంది. అదే సమయంలో ప్రయాణికులు రూ.109తో లగేజీ వ్యాన్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News