Gold Rate Today: బడ్జెట్ కు ముందు భారీగా పెరిగిన బంగారం ధర ..తులం పసిడి ఎంతంటే?
Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి నిజంగానే బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొద్దిరోజులుగా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల ఎక్కువగా పెరగకుండా స్థిరంగా కొనసాగిన వేళ ఇక తగ్గుతుందనుకునేవారికి మళ్లీ భారీగా పెరిగి షాకిస్తున్నాయి. వరుస సెషన్లలో భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. ఇప్పుడు మరోసారి అదే బాటలో భారీగా పెరుగుతోంది. తాజాగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన సమయంలో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు మాత్రం వడ్డీ రేట్లు మార్చుకున్నా బంగారం ధరలు రికార్డ్ స్థాయికి పరుగులు తీస్తున్నాయి.
దేశీయంగా మళ్లీ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే 1200 పెరిగింది. ఇప్పుడు తులం ధఱ రూ. 77,300కు చేరుకుంది. దీనికి ముందు వరుసగా రూ. 150, రూ. 850 చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 1310 పెరిగి 10 గ్రాములకు హైదరాబాద్ లో రూ. 84,330కి చేరుకుంది.
బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం రూ. 1000 పెరగడంతో కిలో వెండి ధర రూ. 99,500కు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో కూడా రూ. 1000 పెరిగి ప్రస్తుతం కిలో రూ. 1.07లక్షలకు చేరింది.