Gold Rate Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..మే 14వ తేదీ బంగారం ధరలు ఇవే..!!

Update: 2025-05-14 02:53 GMT

Gold Rate Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..మే 14వ తేదీ బంగారం ధరలు ఇవే..!!

Gold Rate Today 14th may 2025

Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బంగారం ధరలు మే 14వ తేదీ బుధవారం ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95270గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ.98,684 గా ఉంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ద్వారా భారీగా తగ్గడం ఒక కారణం అని చెప్పవచ్చు.

అమెరికాలో ప్రస్తుతం బంగారం ఒక ఔన్స్ ధర 3250 డాలర్లకు పడిపోయింది. గతంలో ఇది 3500 డాలర్లుగా ఉంది. గతంతో పోల్చితే సుమారు 250 డాలర్ల పతనం చూడవచ్చు. పసిడి ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా చైనా మధ్య జరిగిన తొమ్మిది రోజుల వాణిజ్య ఒప్పందం కారణంగా ఇరుదేశాలు టారిఫ్ ప్లాన్స్ భారీగా తగ్గించుకున్నాయి. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.

బంగారం ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలో పెంచడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మీరు గతంలో బంగారం లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లాభాల బాటలోకి వెళ్లడంతో తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి తగ్గిపోతున్నాయి.బంగారం ధరలు తగ్గడంతో మరోవైపు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు.

బంగారం ఆల్ టైం రికార్డ్ స్థాయితో పోల్చితే రూ.6,000 తగ్గింది. ఫ్యూ,చర్స్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతో మరోవైపు భవిష్యత్తులో పసిడి ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గడంతో మరోవైపు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఆసక్తి చూపిస్తున్నారు. గత రెండు నెలలుగా బంగారం ధరలు భారీగా పెరగడంతో బంగారు ఆభరణాల సేల్స్ కూడా భారీగా తగ్గాయి. ఇక్కడ నుంచి బంగారం ధరలు భవిష్యత్తులో ఎటువైపు వెళ్తాయి అనేది పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు నిర్ణయించనున్నాయి.

Tags:    

Similar News