Pope Trump: పోప్‌ అవతారమెత్తిన ట్రంప్‌.. ఫొటోలు వైరల్!

Pope Trump President new avatar days after love to be next Pope remark telugu news
x

Pope Trump: పోప్‌ అవతారమెత్తిన ట్రంప్‌.. ఫొటోలు వైరల్!

Highlights

ప్రస్తుతం ట్రంప్‌కు సమర్థకుల నుంచి మద్దతు ఉన్నా, వ్యతిరేకుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Pope Trump: పోప్‌గా మారేందుకు ఉత్సాహం చూపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే “నేనే తదుపరి పోప్ అయితే బాగుంటుంది” అంటూ వ్యాఖ్యానించిన ట్రంప్, తాజాగా పాపల్ వస్త్రధారణలో ఉన్న తనకు సంబంధించిన ఏఐ జెనరేటెడ్ చిత్రం సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ ఫొటోను వైట్ హౌస్ అధికార హ్యాండిల్‌ కూడా పంచడం వల్ల విమర్శల తుపాను తలెత్తింది.

ఈ నేపధ్యంలో ట్రంప్ పాపల్ వేషధారణలో కనిపించడం, అది పోప్ ఫ్రాన్సిస్ మరణానికి కేవలం కొన్ని రోజులకే వెలుగులోకి రావడం పలువురిని ఆగ్రహానికి గురి చేసింది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని హాస్యంగా తీసుకున్నప్పటికీ, మరికొందరు దీన్ని అత్యంత అసభ్యంగా అభివర్ణిస్తూ ట్రంప్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మరికొందరు ఆయనను “ఆత్మవిశ్వాసానికి మించి నార్‌సిస్ట్‌” అంటూ ట్రోల్ చేశారు.

పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 22న 88 ఏళ్ల వయసులో మృతిచెందారు. వేటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన అంత్యక్రియలకు ట్రంప్ కూడా హాజరయ్యారు. అయితే అంత్యక్రియల తర్వాత అతి త్వరలోనే ఇలా పోప్ స్థానానికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

ఇక క్యాథలిక్ చర్చ్ కొత్త పోప్‌ను ఇంకా ప్రకటించలేదు. ట్రంప్ మాత్రం న్యూయార్క్ కార్డినల్ టిమొథీ డోలన్‌ను తదుపరి ఆధ్యాత్మిక నేతగా సూచిస్తూ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అమెరికా నుంచి ఎప్పుడూ పోప్ నియమించబడలేదు. అంతర్జాతీయంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా సున్నితమైన సమయంలో ట్రంప్ చేసిన ఈ చర్య మత విశ్వాసుల మనోభావాలను దెబ్బతీసినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రంప్‌కు సమర్థకుల నుంచి మద్దతు ఉన్నా, వ్యతిరేకుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories