స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..వెండి ధరలు కాస్త తగ్గాయి!

Update: 2020-06-10 02:18 GMT
gold rate today in Hyderabad (rep. image)

బంగారం ధరలు పైకెగాశాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 10) దేశీయంగా స్వల్పంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం (10.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 120 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 44,470 రూపాయల వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పెరిగింది. పది గ్రాములకు 90 రూపాయలు పెరిగింది. దీంతో 48,510 రూపాయలకు చేరింది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 40 రూపాయల స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. దీంతో 47వేల మార్కుకు దిగి వచ్చింది. కేజీ వెండి ధర 47,400 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 120 రూపాయలు పెరుగుదల నమోదు చేసి, 44,470 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 90 రూపాయల పెరుగుదల నమోదు చేసి 48,510 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 47,400 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి 45,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదల తో 46,400 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 40 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు దిగి వచ్చి 47,400 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News