Top
logo

Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు బుధవారం, 10 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పంచమి (రాత్రి 08:03 వరకు), తదుపరి షష్ఠి, శ్రవణ నక్షత్రం (మధ్యాహ్నం 02.57 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:50 pm

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • 10 Jun 2020 4:36 PM GMT

  - ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా

  - హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా చేశారు.

  - న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్‌ హబీబ్‌ రాజీనామా చేశారు.

  - అన్ని కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో ముగ్గురు న్యాయవాదుల రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.

  - న్యాయవాదులను త్వరలో నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది.

 • 10 Jun 2020 4:15 PM GMT

  తెలంగాణలో కొత్తగా 191 కేసులు..

  -ఈ రోజు అధికంగా 191కేసులు నమోదయ్యాయి.

  -గడిచిన 24 గంటల్లో 8 మంది కరోనాతో మృతి.

  -రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 156 మంది మరణించారు.

  -తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరింది.

  -ప్రస్తుతం రాష్ట్రంలో 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

  -ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1,817 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 • 10 Jun 2020 4:09 PM GMT

  - నిర్మల్ జిల్లా: నిర్మల్ మండలం రాణాపూర్ గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి,

  - చిట్యాల్ గ్రామ సర్పంచ్ తో పాటు మరో 10 మంది పేకాట రాయుళ్ళ అరెస్ట్,

  - రూ. 1,31,560 నగదు స్వాధీనం, కేసు నమోదు.

 • 10 Jun 2020 4:08 PM GMT

  - తెలంగాణ నుండి ఆంధ్ర వైపు వస్తున్న వందలాది వాహనాలు

  - ఆంధ్రప్రదేశ్ బార్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద డి యెస్ పి రమణమూర్తి ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

  - అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి

  - ఈ పాస్ లు లేని వాహనాలను వెనక్కి పంపుతున్న పోలీసులు

 • 10 Jun 2020 4:03 PM GMT

  - కామారెడ్డి జిల్లా పరిధిలోని దేవునిపల్లిలో వివాహిత ఆత్మహత్య

  - భర్త లేడు అనే మానసిక వేదనతో ఓ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య.

  - దేవుని పల్లి గ్రామానికి చెందిన 29 సంవత్సరాల వయస్సుగల పుల్లన్నగారి నవ్య గా గుర్తింపు .

  - మృతురాలికి ఒక పాప 9 సం ఒక బాబు 07 సం ఉన్నారు.

 • 10 Jun 2020 7:24 AM GMT

  సుప్రీంకోర్టులో నిమ్మగడ్డకు ఊరట.

  -హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.

  - ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.

 • 10 Jun 2020 5:50 AM GMT

  AMC మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ ఇరువర్గాల ఘర్షణ లో మృతి..

  -చిత్తూరు జిల్లా కుప్పం...

  -రామకుప్పం మండలం రామాపురం తండాలో కుప్పం ఏఎంసీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెంకటేష్ నాయక్ మృతి.

  -రెండు వర్గాల మధ్య ఘర్షణ.

  -రామాపురం తాండ లో ఉద్రిక్తత.

  -భారీగా పోలీసులు మోహరింపు.
 • 10 Jun 2020 5:40 AM GMT

  విశాఖ: అరకులోయ మండలం యండపల్లివలస గ్రామానికి చెందిన గుల్షన్ 30 తేనెటీగల దాడిలో మృతి.

  -స్థానికంగా ఉన్న తేనెటీగల పరిశ్రమ లో ఆ పని చేస్తున్న గుల్షన్ రాత్రి తేనెటీగలు దాడి చేయడంతో ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

 • 10 Jun 2020 5:40 AM GMT

  కామారెడ్డి జిల్లా : సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామ శివారులో మిడతల సంచారం

  -చెట్ల ఆకులను తినడంతో గుర్తించిన గ్రామస్థులు

  -వజ్జపల్లి గ్రామాన్ని సందర్శించిన ఏవో

  -గ్రామస్థులు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వ్యవసాయ అధికారులు

 • 10 Jun 2020 5:06 AM GMT

  - ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

  - లాక్ డౌన్ అనంతరం తొలిసారిగా బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న మంత్రి.

  - ఆలయ అధికారులు సాంప్రదాయ ప్రకారం ఆయనకు ఘన స్వాగతం పలికారు

  - కరోన వైరస్ వ్యాక్సిన్ వచ్చేంతవరకు భక్తులందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవాలి అని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. 

Next Story