Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బుధవారం, 10 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పంచమి (రాత్రి 08:03 వరకు), తదుపరి షష్ఠి, శ్రవణ నక్షత్రం (మధ్యాహ్నం 02.57 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:50 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Jun 2020 9:35 AM IST
శ్రీవారి దర్శనానికి టోకెన్లు
- నేటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు
- తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకోసం తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో దర్శన టోకెన్లు జారీ
- ప్రతిరోజూ 3 వేల ఉచిత దర్శన టికెట్లు జారీ చేయనున్న టీటీడీ
- భక్తులకు కేటాయించిన సమయంలో మాత్రమే దర్శనానికి రావాలని సూచన

- 10 Jun 2020 9:32 AM IST
- ఈరోజు ఇంటర్నేషల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశం
- టీ20 వరల్డ్ కప్‌నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం
- 10 Jun 2020 9:31 AM IST
- నేడు సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కేసు విచారణ
- విచారించనున్న సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం
- ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ
- 10 Jun 2020 9:30 AM IST
- నేటి నుంచి వందే భారత్ మిషన్ పేజ్-3
- జూలై 1 వరకు కొనసాగనున్న వందే భారత్ మిషన్ ఫేజ్-3
- వందేభారత్ మిషన్ ఫేజ్-3లో 300 విమానాలు నడపనున్న ఎయిరిండియా
- 43 దేశాల నుంచి 60 వేల మందిని తరలించనున్న ఎయిరిండియా
- 10 Jun 2020 7:59 AM IST
నైరుతికి తోడైన అల్పపీడనం
- నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడనం తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
- ఇవి మరో రెండు రోజులు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- ప్రధానంగా ఇవి కోస్తాంద్ర వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
- మూడు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. -పూర్తి వివరాలు

- 10 Jun 2020 7:14 AM IST
'జగనన్న చేదోడు' పథకం ప్రారంభించనున్న సీఎం
- ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు జగనన్న చేదోడు పథకం ప్రారంభించనున్నారు.
- సీయం క్యాంప్ కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
- ఈ పథకంలో భాగంగా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
- ఈ పధకం ద్వారా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం చేకూరనుంది.




