'హనీ ట్రాప్' లో మరొకరు అరెస్టు

హనీ ట్రాప్ లో మరొకరు అరెస్టు
x
Highlights

హనీ ట్రాప్ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.

హనీ ట్రాప్ కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు 11 మందిని అరెస్టు చేసిన ఎన్ఐఏ తాజాగా మరొకర్ని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకుంది.

2019 లో విశాఖపట్నం 'హానీట్రాప్' గూఢచర్యం కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వేసిగేషన్ ఏజన్సీ మరొకరిని అరెస్టు చేసింది. ఈ కేసులో పాకిస్తాన్ కు చెందిన కొందరు గూఢచారులు.. భారత నౌకలు, జలాంతర్గాముల లొకేషన్, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు జూనియర్ స్థాయి నేవీ అధికారులను ట్రాప్ చేసినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా అందమైన యువతులను వారు ఎర వేసి.. వివరాలను కనుగొనేందుకు ప్రయత్నించారు.

ఈ కేసుకు సంబంధించి ముంబైలో ఉంటున్న 53 ఏళ్ళ అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ జబ్బార్ షేక్ ని అతని ఇంట్లోనే అరెస్టు చేసి.. పలు డిజిటల్ పరికరాలను, అనుమానాస్పద డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతని అరెస్టుతో మొత్తం అరెస్టయినవారు సంఖ్య 15 కి పెరిగింది. ఇండియాలో పుట్టి పాక్ లో పెరిగిన ఇతని భార్య షయిస్తా కైసర్ కూడా అరెస్టయినవారిలో ఉంది. గత మే 15 న 11 మంది నేవీ సిబ్బందిని కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ఇక ముంబైకే చెందిన అబ్దుల్ రెహమాన్ లక్డావాలా అనే వ్యక్తి ని కూడా తాజాగా అదుపులోకి తీసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories