Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. అదే బాటలో వెండి!

Gold Rate Today:: బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

Update: 2021-03-09 01:43 GMT

Gold  Silver(ఫైల్ ఇమేజ్ )

Gold Rate Today: బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. సోమవారం నాటి ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (మార్చి 9) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం (09.03.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయలు పెరిగి 42,000 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 320 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,820 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరలతో పోలిస్తే కాస్త పెరిగింది. ఈరోజు వెండి ధరల్లో పెద్దగా మార్పులూ లేవు. కేజీ వెండి మరో 900 రూపాయలు పెగిరి.. 71వేల రూపాయల వద్ద ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 71,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. మంగళవారం(09.03.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయలు పెరిగి 42,000 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 320 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 45,820 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే మార్పులు లేకుండా 44,150 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ధరతో పోలిస్తే 48,160 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరల కంటే కాస్త తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 66,500 రూపాయల వద్ద నమోదు అయింది. హైదరాబాద్ ధరతో పోలిస్తే వెండి ధర ఢిల్లీలో 4,500 రూపాయలు తగ్గువగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-03-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News