Gold Rate: దేశీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

Gold Rate: తొమ్మిది నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుంటున్న పసిడి * ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రా. రూ. 43,870

Sandeep Eggoju
Published on: 8 March 2021 10:08 AM IST
Gold Rate: దేశీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన  బంగారం ధరలు..
X

Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు మరోమారు స్వల్పంగా పెరిగాయి. తొమ్మిది నెలల కనిష్ట స్థాయి నుంచి పసిడి ధరలు క్రమేపీ కోలుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర స్వల్పంగా పెరిగి 43,870 రూపాయలుగా నమోదయింది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,860 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 44,530 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 41,720 గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 45,510 రూపాయల వద్దకు చేరింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story