మ‌స్క్ ఔట్‌.. ప్ర‌పంచ కుబేరుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్‌..

World's Richest Person: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ట్విట్టర్ బాస్..ఆ స్థానాన్ని కోల్పోయారు.

Update: 2022-12-14 16:00 GMT

మ‌స్క్ ఔట్‌.. ప్ర‌పంచ కుబేరుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్‌.. 

World's Richest Person: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ట్విట్టర్ బాస్..ఆ స్థానాన్ని కోల్పోయారు. ఫోర్బ్స్‌ అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని అపర కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కోల్పోయారు. నెంబర్ 1 ధనవంతుడు స్థానాన్ని ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ LVMHకు సీఈవోగా వ్యవహరిస్తున్న బెర్నార్డ్​ అర్నాల్ట్​ కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది ఎలాన్ మస్క్ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. 168.5 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక ప్రపంచ కుబేరుడిగా అవతారం ఎత్తిన లూయిస్ విట్టాన్ కంపెనీ ఈసీవోగా ఉన్న బెర్నాల్డ్ ఆస్తులు 172.9 బిలియన్ డాలర్లుకాగా..ఇక భారత్‌కు చెందిన వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ 134.6 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో మూడొవ స్థానంలో నిలిచారు. ఈ కామర్స్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 11.8 బిలియన్ డాలర్ల నికర సంపదతో 4వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 92.8 బిలియన్ డాలర్ల నికర సంపదతో 8వ స్థానంలో నిలిచారు.

నిన్నా, మొన్నటి వరకు ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుడిగా ఉన్న ట్విట్టర్ బాస్ అయిన ఎలాన్ మస్క్ తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోవడానికి పలు ముఖ్యమైన కారణాలున్నాయి. 44 డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసే డీల్‌ను మస్క్ కుదుర్చుకున్న సమయంలోనే..అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొన్ని కఠినమైన ఆర్థిక విధానాలను ప్రకటించింది. ఇది కూడా మస్క్ పాలిట ప్రతికూలంగా మారింది. అంతేకాదు..ఈ డీల్ కోసం నిధులను సమకూర్చుకునేందుకు మస్క్ తన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాలోని కొన్ని షేర్లను అమ్ముకున్నారు. దీంతో 2022 సంవత్సరంలో ఇప్పటివరకు టెస్లా కంపెనీ షేరు విలువ దాదాపు 50 శాతానికిపైగా తగ్గిపోయింది. ఫలితంగా దాదాపు 168 బిలియన్ డాలర్ల మస్క్ సంపద ఆవిరైపోయిందని న్యూయార్క్‌లోని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది.

అంతకుముందు రెండేళ్లపాటు అమెరికా స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ షేరు హవా కొనసాగింది. దీంతో రెండేళ్ల క్రితం ఒకానొక దశలో మస్క్ నికర సంపద విలువ దాదాపు 340 బిలియన్ డాలర్లకు చేరింది. కానీ బంగారు బాతు లాంటి టెస్లా కంపెనీ షేర్లను అమ్ముకోవాలని తీసుకున్న నిర్ణయం..ఆయన సంపదను అమాంతం తగ్గించేసింది. దీంతో మస్క్ నికర సంపద విలువ కాస్తా..340 బిలియన్ డాలర్ల నుంచి 181.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ ఉత్పత్తుల కంపెనీ LVMH కి సీఈవోగా వ్యవహరిస్తున్న బెర్నార్డ్​ అర్నాల్ట్​ సంపద విలువ 186.5 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ఫోర్బ్స్‌ అత్యంత ధనవంతుల జాబితాలో అర్నాల్డ్‌కు మొదటి స్థానం దక్కింది. 

Tags:    

Similar News