Portable AC: మండుటెండల్లో చల్లని న్యూస్.. ఈ మినీ పోర్టబుల్ ఏసీ మీకోసమే.. అందుబాటు ధరల్లోనే..!
Portable AC: వేడి విపరీతంగా పెరిగిపోవడంతో.. ఏసీ, కూలర్ వంటి వాటిని వాడుతుంటారు. వీటి ద్వారా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే, ప్రస్తుతం ఎయిర్ కండీషనర్లు చాలా ఖరీదుగా మారాయి. వీటి వాడకంతో కరెంట్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తుంటాయి.
Portable AC: మండుటెండల్లో చల్లని న్యూస్.. ఈ మినీ పోర్టబుల్ ఏసీ మీకోసమే.. అందుబాటు ధరల్లోనే..!
Portable AC: మాడు పగిలే ఎండలు మొదలయ్యాయి. మార్చి నెల పోయి.. ఏప్రిల్ రాగానే ఎండలు మరింత ముదిరిపోయాయి. వేడి విపరీతంగా పెరిగిపోవడంతో.. ఏసీ, కూలర్ వంటి వాటిని వాడుతుంటారు. వీటి ద్వారా వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే, ప్రస్తుతం ఎయిర్ కండీషనర్లు చాలా ఖరీదుగా మారాయి. వీటి వాడకంతో కరెంట్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి మీకోసం అద్భుతమైన వార్తను తీసుకొచ్చాం. చిన్నగా ఉండి, తక్కువ ఖర్చుతో కూడిన పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ గురించి చెప్పబోతున్నాం. దీనితో మీ గదిని సిమ్లా వంటి చల్లదనాన్ని పొందవచ్చు.
పోర్టబుల్ ఏసీ ధర..
ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్‌ను ఆన్‌లైన్‌లో చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు మీకు ప్రసిద్ధ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ పోర్టబుల్ ఏసీ ధర రూ.18,738గా ఉంది. అయితే దీనిని 74% తగ్గింపుతో రూ.4,810కి కొనుగోలు చేయవచ్చు. దీని బరువు చాలా తేలికగా ఉంటుంది. దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
పోర్టబుల్ ఏసీ ఫీచర్లు..
ఈ చిన్న పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ 500 ml వాటర్ ట్యాంక్‌తో వస్తుంది. ఇది ఒకసారి నిండిన తర్వాత 3 లేదా 4 గంటల పాటు చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. దీన్ని ఆపరేట్ చేయడానికి, ట్యాంక్‌లో నీటిని నింపి, ఆపై బటన్‌ను నొక్కితే చాలు. ఇది మీ గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది.
ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్‌ని ఇంట్లో కూలర్ లాగా ఉపయోగించవచ్చు. ఒక గది నుంచి మరొక గదికి సులభంగా తరలించవచ్చు. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఈ పోర్టబుల్ ఏసీకి డిమాండ్ వేగంగా పెరుగుతోంది.