Smartphone Buying Tips: స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా.. ఈఎంఐలో ఇలా ప్లాన్ చేస్తే.. రూ10వేలు ఆదా..!
Smartphone: మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే, మార్కెట్‌లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ధరలో మాత్రం చాలా తేడాలుంటాయి.
Smartphone Buying Tips: స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా.. ఈఎంఐలో ఇలా ప్లాన్ చేస్తే.. రూ10వేలు ఆదా..!
Smartphone EMI Purchasing Tips: మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే, మార్కెట్‌లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ధరలో మాత్రం చాలా తేడాలుంటాయి. మనకు నచ్చిన ఫోన్ ఎక్కువ ధర ఉంటే, కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తుంటాం. అయితే, పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఈఎంఐలలోనూ ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చు. ఇలాంటి సమయంలో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను ఎలా కొనుగోలు చేయాలి, భారీగా ఆదా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
EMIలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా భారీగా ఆదా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. స్మార్ట్‌ఫోన్ మొత్తం రూ. 1 లక్ష అయితే, మీరు దాని ధరలో ₹ 10,000 వరకు ఆదా చేసుకోవచ్చన్నమాట. వాస్తవానికి, స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు అందిస్తుంటాయి. వీటిని ఉపయోగించి మీరు 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, మీరు నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని కలిగి ఉన్నప్పుడల్లా మీరు ఈ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎందుకంటే ప్రతి బ్యాంకు ఈ ఆఫర్‌ను అందించదు. అటువంటి పరిస్థితిలో మీరు నెలవారీ వాయిదాలలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, ఆఫర్ అందించే బ్యాక్ కార్డుతో కొనుగోలు చేస్తే భారీగా లాభాపడడొచ్చు. దీనిపై నెలవారీ వాయిదా ఎంపికను ఎంచుకోవాలి. ఇక ఆఫర్లలో కొనుగోలు చేయడం వల్ల, కార్డ్ డిస్కౌంట్, బ్యాంక్ ఈఎంఐ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇలా తక్కువ ధరకే ఫొన్‌ను సొంతం చేసుకోవచ్చు.