గ్రేట్ గోయల్: ఇల్లు మాత్రమే ఉంచుకొని.. పేదల కోసం రూ. 600కోట్ల ఆస్తిని విరాళమిచ్చిన..

Arvind Goyal Donate Property: ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్త డాక్టర్ అరవింద్ కుమార్ గోయల్ తన మొత్తం సంపదను పేదల కోసం విరాళంగా ఇచ్చారు.

Update: 2022-07-21 10:00 GMT

గ్రేట్ గోయల్: ఇల్లు మాత్రమే ఉంచుకొని.. పేదల కోసం రూ. 600కోట్ల ఆస్తిని విరాళమిచ్చిన..

Arvind Goyal Donate Property: ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్త డాక్టర్ అరవింద్ కుమార్ గోయల్ తన మొత్తం సంపదను పేదల కోసం విరాళంగా ఇచ్చారు. మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.600 కోట్లు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన గోయల్‌ ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, సామాజికవేత్త. స్థానికంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తోన్న ఆయన.. 100కు పైగా విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మొరాదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేశారు. గోయల్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే ఆయన కుటుంబసభ్యులు కూడా మద్దతిచ్చారట. కేవలం ఇంటిని మాత్రమే ఉంచేసుకుని సుమారు రూ.600 కోట్ల విలువ చేసే తన ఆస్తినంతటిని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి రాసిచ్చారు. నిరుపేదల సంక్షేమం, ఉచిత విద్య కోసం ఈ డబ్బులను వినియోగించాలని సూచించారు. 25 ఏండ్ల కిందే ఈ నిర్ణయం తీసుకున్నానని డాక్టర్‌ గోయల్‌ చెప్పారు.

25ఏళ్ల క్రితం జరిగిన సంఘటనే నా జీవితాన్ని మార్చేసిందని ఈ సందర్భంగా గోయల్‌ చెప్పారు. పాతికేళ్ల క్రితం నేను రైళ్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నాడు. ఓవైపు వణుకుపుట్టించే చలి.. ఒంటిపైన కప్పుకోవడానికి ఏమీ లేవు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. అతడిని చూసి చలించిపోయి చేతనైన సాయం చేశా. కానీ అ సంఘటన మనసులో అలాగే ఉండిపోయింది. ఒక్కరికైతే సాయం చేయగలిగా.. కానీ దేశంలో ఇలాంటి వాళ్లు ఎంతో మంది ఉంటారు కదా అనిపించింది. వాళ్లకు కూడా సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News