Alert: ఉద్యోగులకి అలర్ట్.. చిన్న పొరపాటు పెన్షన్, గ్రాట్యుటీని ఆపేస్తుంది..!
Alert: కేంద్ర ప్రభుత్వం పండుగ సందర్భంగా ఉద్యోగులకి డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్‌లని పెంచింది.
Alert: ఉద్యోగులకి అలర్ట్.. చిన్న పొరపాటు పెన్షన్, గ్రాట్యుటీని ఆపేస్తుంది..!
Alert: కేంద్ర ప్రభుత్వం పండుగ సందర్భంగా ఉద్యోగులకి డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ), డియర్‌నెస్ రిలీఫ్‌లని పెంచింది. రైల్వే ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనివల్ల లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందారు. జీతం, గ్రాట్యుటీ పెంపుతో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని నిర్ణయించారు. కొత్త నిబంధనను కేంద్ర ఉద్యోగులకు అమలు చేయగా క్రమంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటిని అమలు చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు చెప్పే విషయం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021కి సంబంధించినది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తన సర్వీస్‌లో తీవ్రమైన తప్పిదానికి పాల్పడినట్లు తేలితే అతని పెన్షన్, గ్రాట్యుటీని నిలిపివేయవచ్చని ఈ నిబంధన చెబుతోంది. CCS (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 8పై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నిర్ణయం తీసుకునే హక్కు కొంతమంది అధికారులకు ఇచ్చారు. వీరిలో ముఖ్యంగా ప్రెసిడెంట్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్, గ్రాట్యుటీని ఆపే శక్తి ఉంటుంది.
అలాగే అక్టోబరు 7న సవరించిన రూల్ 8 ప్రకారం రిటైర్మెంట్ అయిన వ్యక్తి "సర్వీస్ సమయంలో తీవ్రమైన దుష్ప్రవర్తనకు" పాల్పడితే పెన్షన్‌ను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసే హక్కు ఉంటుంది. ఇది మాత్రమే కాదు రిటైర్మెంట్ తర్వాత చేయవలసిన ఇతర ఉద్యోగం లేదా సేవలలో కోత విధిస్తారు.పెన్షన్ లేదా గ్రాట్యుటీని శాశ్వతంగా లేదా నిర్దిష్ట కాలానికి నిలిపివేయవచ్చు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు UPSCని సంప్రదించడం అవసరం. ఇంకా రూల్ 44 ప్రకారం కనీస పెన్షన్ నుంచి పెన్షన్ మొత్తాన్ని తగ్గించలేరు. ఇది నెలకు రూ.9000గా ఉంటుంది.