Aadhaar Card: ప్రతి ప్రభుత్వ పనికి ఆధార్ తప్పనిసరి.. ఒకవేళ ఇది లేదంటే ఏం చేయాలి..?
Aadhaar Card: భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం.
Aadhaar Card: ప్రతి ప్రభుత్వ పనికి ఆధార్ తప్పనిసరి.. ఒకవేళ ఇది లేదంటే ఏం చేయాలి..?
Aadhaar Card: భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రం. అనేక ప్రభుత్వ పనులలో ఇది ఉపయోగపడుతుంది. మరికొన్ని చోట్ల గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ వినియోగిస్తున్నారు. కానీ ఆధార్ కార్డు లేనప్పుడు ఏం చేయాలి.. దీనివల్ల అనేక పనులు నిలిచిపోతాయి. ఆధార్ అనేది దేశంలోని ప్రతి పౌరునికి అందించిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది చాలా ప్రయోజనాల కోసం సృష్టించిన ముఖ్యమైన పత్రాలలో ఒకటి. ప్రతి భారతీయ పౌరుడు ఆధార్ కార్డును కలిగి ఉండటం అవసరం. ఎందుకంటే ఇది గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది.
ఆధార్ కార్డుకి అప్లై చేయండి..
ఆధార్ కార్డు లేదంటే అన్ని పనులు ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో ఆ వ్యక్తి ఆధార్ కార్డును సంపాదించాలి. తద్వారా అన్ని పనులు సజావుగా జరుగుతాయి. దీని కోసం వ్యక్తికి కొన్ని పత్రాలు అవసరం అవుతాయి. ఆధార్ కార్డు చేయడానికి గుర్తింపు రుజువు, రిలేషన్ షిప్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బర్త్ ప్రూఫ్ అవసరం. ఇవి కాకుండా మరికొన్ని పత్రాలతో కూడా ఆధార్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
కావాలసిన పత్రాలు
1. రేషన్ కార్డు.
2. జనన ధృవీకరణ పత్రం.
3. పాస్‌పోర్ట్
4. పాన్ కార్డ్/ఇ-పాన్.
5. రేషన్/PDS ఫోటో కార్డ్.
6. ఓటరు ID/e-ఓటర్ ID.
7. డ్రైవింగ్ లైసెన్స్
8. ఆయుధ లైసెన్స్.
9. కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం/ UT ప్రభుత్వం/ PSU/ బ్యాంక్ జారీ చేసిన సేవా ఫోటో గుర్తింపు కార్డ్.
10. పెన్షనర్ ఫోటో కార్డ్ / ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డ్.
11. రైతు ఫోటో పాస్‌బుక్.
12. సంబంధిత కేంద్ర/రాష్ట్ర/UT ప్రభుత్వాలు జారీ చేసిన వికలాంగుల గుర్తింపు కార్డు/వికలాంగుల వైద్య ధృవీకరణ పత్రం.
13.MNREGA జాబ్ కార్డ్
14. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఫోటోతో కూడిన వివాహ ధృవీకరణ పత్రం.
15. ఫోటోగ్రాఫ్‌తో కూడిన ST/SC/OBC సర్టిఫికేట్
16. గుర్తింపు పొందిన విద్యా సంస్థ జారీ చేసిన స్కూల్ ID కార్డ్ / ఫోటో ID కార్డ్.
17. బ్యాంక్ అధికారి ద్వారా స్టాంప్ చేసిన బ్యాంక్ పాస్‌బుక్.