Karnataka government plans: ఎనీటైం రైస్... కర్ణాటక ప్రభుత్వం యోచన!
Karnataka government plans ..ఎనీటైం మనీ మాదిరిగానే ఎనీ టైం రైస్ విధానాన్ని అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది...
Anytime rice
Karnataka | ఎనీటైం మనీ మాదిరిగానే ఎనీ టైం రైస్ విధానాన్ని అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది... సరుక్కి సరిపడా మొత్తం వేయగానే, దానికి సంబంధించిన సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ విధానాన్ని ఇప్పటికే రెండు దేశాల్లో అమలు చేస్తుండగా, వీటి సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేశారు. కర్ణాటకలో ఇది అమలైతే దేశ వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకుల్లో నగదుకు మాదిరిగానే గంటల తరబడి క్యూలో నించునే వీలులేకుండా సమయం వినియోగించుకునే విధంగా ఏర్పట్లు చేస్తున్నారు.
నగదు డ్రా చేసుకునే ఏటీఎం తరహాలో బియ్యం కోసం ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం బీపీఎల్ కార్డు కలిగిన వారికి ఉచితంగా, ఏపీఎల్ కార్డు కలిగిన వారికి నిర్ధిష్ట మొత్తంలో నగదు చెల్లించి బియ్యం, పప్పులు పొందే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. అయితే సరుకుల కోసం రేషన్ దుకాణాలు తెరిచే సమయానికి వెళ్లి గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికి చెక్ పెడుతూ ఏ సమయంలోనైనా బియ్యం తీసుకునేలా ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ విధానం ప్రపంచంలోని ఇండోనేసియా, వియత్నాం దేశాల్లో మాత్రమే అమలులో ఉంది. కరోనా నేపథ్యంలో వినియోగదారులు క్యూలో నిల్చోకుండా ఈ విధానాన్ని ఆయా దేశాల్లో అమలు చేస్తున్నారు. దీన్ని కర్ణాటకలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కె.గోపాలయ్య కూడా ఇటీవల ధ్రువీకరించారు. ఏటీఎం రైస్ వ్యవస్థపై చర్చ సాగుతోందని, ఈ కార్యక్రమ సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.