YSRCP MLA tested corona positive : మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా!

YSRCP MLA tested corona positive: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక అధికార పార్టీ వైసీపీని కూడా కరోనా వణికిస్తుంది.

Update: 2020-07-17 13:57 GMT
coronavirus (File Photo)

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఇక అధికార పార్టీ వైసీపీని కూడా కరోనా వణికిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పలువురు
 శాసనసభ్యులకీ కరోనా సోకగా తాజాగా ఈ జాబితాలోకి మరో ఎమ్మెల్యే చేరిపోయాడు. కర్నూలు జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్రపాణిరెడ్డికి కరోనా సోకింది. గత కొద్ది రోజులుగా ఆయనకి కరోనా లక్షణాలు కనిపించగా, అయన ప‌రీక్షలు నిర్వహించుకున్నారు. శుక్రవారం అయనకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

ఇక ప్రస్తుతం అయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అంతేకాకుండా తనని ఎవరు పరామర్శించడానికి రావొద్దని అన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నుంచి ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు కరోనా సోకింది. అయితే ఇందులో అంజద్ బాషా దంపతులు కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 20,245 శాంపిల్స్‌ని పరీక్షించగా 2592 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 837 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 37,751కి చేరుకుంది. ఇక మృతుల సంఖ్య 534గా ఉండగా, కోలుకున్న వారి సంఖ్య 17,812 గా ఉంది. చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,405 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

Tags:    

Similar News