కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి.. చక్రాల కింద పడిన 5 మంది

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో ప్రమాదం చోటుచేసుకుంది. రథం చక్రాల కింద ఐదుగురు పడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Update: 2026-03-10 07:53 GMT

కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి.. చక్రాల కింద పడిన 5 మంది

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలో ఉన్న శ్రీమాత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం సందర్భంగా రథాన్ని భక్తులు లాగుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది.

కదులుతున్న రథం చక్రాల కింద ఐదుగురు భక్తులు పడినట్టు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న అధికారులు, దేవస్థానం సిబ్బంది గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.

ఈ ఘటనతో రథోత్సవం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News