Bhumana Karunakar Reddy: శ్రీవారి ఆలయం కోసం రూ. 12.5 కోట్లు వసూలా? చంద్రబాబుపై విరుచుకుపడ్డ భూమన!

Bhumana Karunakar Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2026-03-09 07:23 GMT

Bhumana Karunakar Reddy: శ్రీవారి ఆలయం కోసం రూ. 12.5 కోట్లు వసూలా? చంద్రబాబుపై విరుచుకుపడ్డ భూమన!

Bhumana Karunakar Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి గతంలో జరిగిన భూ సేకరణ వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు, స్వామివారి ఆలయానికే భూమిని అమ్ముకున్నారని విమర్శించారు.

దేశవ్యాప్తంగా ఉచితం.. అమరావతిలో మాత్రం పైసలే!

దేశంలో ఎక్కడ శ్రీవారి ఆలయాలు నిర్మించాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా దాతలు భూములను ఉచితంగా అందజేస్తారని భూమన గుర్తుచేశారు. ముంబైలో అప్పటి సీఎం షిండే ఆలయ నిర్మాణం కోసం భూమిని ఉచితంగా ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం భూములను కానుకగా ఇచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించింది. అమరావతిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు హయాంలో వెంకటపాలెం వద్ద ఎకరాకు రూ. 50 లక్షల చొప్పున టిటిడి డబ్బులు చెల్లించి భూమి కొనుగోలు చేయాల్సి వచ్చిందని భూమన మండిపడ్డారు.

కంపెనీలకు ఫ్రీ.. దేవుడికి మాత్రం ఫీజా?

సుమారు రూ. 12.5 కోట్లు ఖర్చు పెట్టి టిటిడి ఆ భూములను కొనుగోలు చేసిందని, అదే ప్రాంతంలో మూడు ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 50 ఎకరాలు ఉచితంగా ఇవ్వాలని అడిగినా చంద్రబాబు ఇవ్వలేదని, డబ్బులు చెల్లిస్తేనే భూమి ఇచ్చారని భూమన విమర్శించారు.

తిరుమలలో నెయ్యి నిల్వలపై ఆందోళన

ప్రస్తుతం తిరుమలలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని భూమన ఆరోపించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న నెయ్యి నిల్వలు కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని, టిటిడి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇటీవల నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటం అనేది స్వామి వారు కన్నెర్ర చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News