ACB Raids: ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

ACB Raids: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ మెరుపు దాడులు చేస్తోంది.

Update: 2026-03-10 10:08 GMT

ACB Raids: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలపై ఏసీబీ మెరుపు దాడులు చేస్తోంది. విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, తిరుపతి టౌన్‌ప్లానింగ్ ఆఫీసుల్లో దాడులు చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. శ్రీకాకుళంలో ఆరుగురు ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక ఫైల్స్ పరిశీలించేందుకు వెళ్లగా... ఏసీబీ సిబ్బందిని చూసి కొందరు అక్కడ నుంచి వెంటనే పరారయ్యారు.

అనంతపురంలోని నగరపాలిక సంస్థ కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డిఎస్పి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గత కొంతకాలంగా నగరపాలిక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఏసీబీ దాడులు చేస్తుండగా.. సోదాల తర్వాత అందుకు గల కారణాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News