Liquor Prices: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ప్రీమియం బ్రాండ్ల ధరలు!

Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల ధరలపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Update: 2026-03-10 05:49 GMT

Liquor Prices: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ప్రీమియం బ్రాండ్ల ధరలు!

Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల ధరలపై ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరల భారాన్ని తగ్గించి, ఇతర రాష్ట్రాలకు దీటుగా ధరలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తెలంగాణ వైపు చూస్తున్న మందుబాబులు:

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం, ఫారిన్ లిక్కర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే, ఒక్కో బాటిల్‌పై సుమారు ₹3,000 నుండి ₹5,000 వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఈ భారీ తేడా వల్ల ఏపీలోని మద్యం ప్రియులు స్థానికంగా కొనడానికి ఆసక్తి చూపడం లేదు.

ఆదాయానికి గండి.. పెరుగుతున్న నాన్-డ్యూటీ లిక్కర్:

ధరలు ఎక్కువగా ఉండటంతో పక్క రాష్ట్రాల నుండి 'నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్' (NDPL) అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ కోల్పోవాల్సి వస్తోంది. ఈ ఆదాయ గండిని అరికట్టాలంటే ధరలను తగ్గించడమే ఏకైక మార్గమని అధికారులు భావిస్తున్నారు.

నేడు సీఎం రివ్యూ.. 13న క్యాబినెట్ నిర్ణయం:

ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ధరల తగ్గింపు ఎంత వరకు ఉండాలి? ఏయే బ్రాండ్లపై ప్రభావం పడుతుంది? అనే అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. ఈనెల 13న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ధరల తగ్గింపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News