Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్: మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో ఉగాది పర్వదిన వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది.
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్: మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో ఉగాది పర్వదిన వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 19న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న 'ఉగాది ఆస్థానాన్ని' పురస్కరించుకొని, మార్చి 17వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారికంగా ప్రకటించింది.
సాధారణంగా ఉగాది, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివార ఆస్థానం వంటి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి (కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా గర్భాలయం నుంచి ప్రధాన ద్వారం వరకు ఆలయ ప్రాంగణాన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన మిశ్రమంతో శుద్ధి చేస్తారు.
దర్శనాలు, సేవల రద్దు వివరాలు:
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మరియు ఉగాది ఆస్థానం కారణంగా తితిదే పలు దర్శనాలను రద్దు చేసింది:
మార్చి 17 (మంగళవారం): వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు.
మార్చి 16 (సోమవారం): ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఇచ్చే సిఫార్సు లేఖలను స్వీకరించరు.
మార్చి 19 (గురువారం - ఉగాది): ఉగాది పర్వదినం సందర్భంగా కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం ఉంటుంది. మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది.