Ysr Jagananna Colonies Scheme: నేడు వైఎస్సార్ జగనన్న కాలనీల పథకం ప్రారంభం..

Ysr Jagananna Colonies Scheme:తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి జగన్ వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.

Update: 2021-06-03 02:02 GMT

Ysr Jagananna Colonies Scheme:(The Hans India)

Ysr Jagananna Colonies Scheme: కరోనా లాంటి ఎన్ని అవరోధాలు వచ్చినా సంక్షేమ పథకాలను కొనసాగించడంలో ఏపీ సర్కార్ ముందువరుసలో నిలుస్తోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు వైస్సార్ జగనన్న కాలనీస్ స్కీం కు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది.

ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుంది. స్థలం ఉండీ కట్టుకోలేని వారికి అందుకయ్యే ఖర్చును తన వాటా కింద భరిస్తుంది. రాష్ట్రంలో ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇళ్లు 340 చదరపు అడుగుల్లో ఉంటాయి.

ఇక, 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో జూన్ 2023 నాటికి రెండు దశల్లో 28,30,227 ఇల్లను నిర్మిస్తుంది. ఇందుకోసం రూ. 50,994 కోట్లు ఖర్చు చేయనుంది. మొదటి దశను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో విడత కింద 12.70 లక్షల ఇళ్లను రూ. 22.860 కోట్లలో నిర్మించనుంది. జూన్ 2023 నాటికి వీటిని నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ్టి నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి డిసెంబర్‌ నాటికి మొదటి దశ ఇళ్ల నిర్మాణం పనులు పూర్తిచేయాలని అందుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పన కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News