రైతు అవతారం ఎత్తిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి దంపతులు

రైతు అవతారం ఎత్తిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి దంపతులు రైతు అవతారం ఎత్తిన వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి దంపతులు

Update: 2019-10-07 11:16 GMT

దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దంపతులు రైతు అవతారం ఎత్తారు. చాలా ఏళ్ళ తరువాత చెరువులకు నీరు రావడంతో రైతులు పంటలు వేయడం ప్రారంభించారు. దీంతో శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి నందినిరెడ్డి ఇద్దరు కలిసి మాగాణిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా గట్లు శంగత్తు కొట్టి వరినాట్లు వేశారు. అనంతరం రైతులతో కలిసి వరి పొలాలను సందర్శించారు. ఈ సందర్బంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత రైతుల కళ్ళల్లో సంతోషం చూస్తున్నామని.. జగన్ పరిపాలనలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని..



 









ఇది శుభసూచకం అని అన్నారు. కాగా 2009 లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. 2014 లో తిరిగి వైసీపీ తరుపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే కుటుంబసమస్యల కారణంగా 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్ కు టిక్కెట్ దక్కింది. ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 


Tags:    

Similar News