అమ్మఒడి పథకం లబ్ధిదారులకు శుభవార్త అందించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానస పుత్రిక అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు సీఎం శుభవార్త అందించారు.

Update: 2020-01-06 15:49 GMT
CM YS JAGAN

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానస పుత్రిక అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు సీఎం శుభవార్త అందించారు. ఈ పథకం లబ్ధిదారులకు మొదటి సంవత్సరం 75శాతం హాజరు ఉండాలనే నిబంధన మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలను బడికి పంపిస్తే తల్లికి ప్రతీ ఏటా 15 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించాలని సీఎం నిర్ణయించారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తొలి ఏడాది కచ్చితంగా 75శాతం నిబంధన లేదని సీఎం జగన్ వెల్లడించారు.

సోమవారం తన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్షించారు. ఈనెల 9వ తేదీన చిత్తూరులో అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం అధికారుకు తెలిపారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమ్మఒడి పథకం లబ్ధిదారులైన వారికి 15వేలు పంపితే పిల్లల అవసరాలకు ఉపయోగిస్తారని తెలిపారు. విద్యాశాఖ సమీక్షకు సంబంధించిన పలు అంశాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామిని నేరవేరుస్తామని స్పష్టం చేశారు.

పాఠశాలల్లో నాడు , నేడు, అమ్మఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యత విషయమై సమీక్ష నిర్వహించారు. అయితే 61,345 పిల్లలకు చెందిన వివరాలు సరిగ్గా లభ్యం కావడంలేదని.. మరికొంత సమయం కావాలని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. 7,231 అనాథ పిల్లలకు అమ్మ ఒడి నగదు సగం అనాథశ్రమానికి ఇవ్వాలని, మరికొంత పిల్లల పేరుమీద జమ చేయాలని సూచించారు. అయితే 1,81,603 మంది పిల్లలకు చెందిన కుటుంబాల్లో 300 పైబడి యూనిట్ల కరెంటు ఉందని, కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై రీ వెరిఫికేషన్‌ చేయించి పేదలకు అమ్మఒడి తప్పకుండా వర్తించేలా చేయాలని సూచించారు.  

Tags:    

Similar News